కొరియన్.. మెరిసెన్.. ఇవే ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్!!
కొరియన్... ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్. బ్యూటీ, హెల్త్ టిప్స్, డ్రెస్సింగ్ స్టయిల్... అన్నిటా అక్కడి పద్ధతుల్ని మన వాళ్లు ఆచరిస్తున్నారు. ఇక, నగలు మాత్రం మడికట్టుకుంటాయా. తమ సౌందర్యాన్ని ఎవరైనా సరే ఆస్వాదించవచ్చని అమాంతంగా వచ్చి ఇక్కడ వాలిపోతున్నాయి.
కొరియన్… ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్. బ్యూటీ, హెల్త్ టిప్స్, డ్రెస్సింగ్ స్టయిల్… అన్నిటా అక్కడి పద్ధతుల్ని మన వాళ్లు ఆచరిస్తున్నారు. ఇక, నగలు మాత్రం మడికట్టుకుంటాయా. తమ సౌందర్యాన్ని ఎవరైనా సరే ఆస్వాదించవచ్చని అమాంతంగా వచ్చి ఇక్కడ వాలిపోతున్నాయి. అందుకే నగల మోడళ్లలోనూ కొరియనే ఫ్యాషన్!
మన ఆభరణాల్లో నవరత్నాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే, కొరియాలో అమెథిస్ట్, వైట్ జేడ్, గ్రీన్ జేడ్, స్మోకీ టోపాజ్లాంటివి విలువైన రత్నాలకు విలువిస్తారు. అమెథిస్ట్ కొరియన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన రాయి. ఇది మానసిక, శారీరక ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. తెలుపు, ఆకుపచ్చ జేడ్లను ధరించడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అందమైన నగల్లో స్మోకీ టోపాజ్కి ప్రాధాన్యం ఎక్కువ. కొరియన్ జువెలరీ బంగారం, వెండితో తయారైనప్పటికీ వాటిలో రాళ్లు, వజ్రాలు, ముత్యాలు, ఎనామిల్ మెరుపుల మేళవింపు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి సాధారణ నగలకంటే మరింత అందంగా మెరిసిపోతాయి.
నోరిగే… సంప్రదాయ కొరియన్ జువెలరీలో అధిక ప్రాచుర్యం పొందిన ఆభరణాలు నోరిగే, బిన్యోను. ఈ ఆభరణాలను బంగారం, వెండి లోహాలకు పట్టు దారాలు జోడించి తయారు చేస్తారు. ప్రకృతి, దైనందిన జీవితం ప్రేరణగా వీటిని రూపొందిస్తారు. అందుకే ఈ తరహా నగల్లో పువ్వులు, ఆకులకు ప్రాధాన్యం ఎక్కువ. కొరియన్ ఆభరణాలకు జోడించే పొడవాటి టాజిల్స్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. వీటిని ధరించడం వల్ల సంపద, శాశ్వత యవ్వనం, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు కొరియన్లు. ఇప్పుడు ఈ నగలు మనదగ్గరా టాప్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌తో పాటు ప్రముఖ జువెలరీ షాపుల్లోనూ కొరియన్ స్టోర్స్ పేరుతో ప్రత్యేకంగా ఈ నగలను విక్రయిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

