Legal Opinion | వారసత్వంగా నాకు 4 కోట్లు వచ్చాయి.. ఆ ఆస్తిని మా అన్నలు కాజేయొద్దంటే ఏం చేయాలి? ఓ సోదరి ప్రశ్న !
Legal Opinion | వారసత్వంగా నాకు 4 కోట్లు వచ్చాయి.. ఆ ఆస్తిని మా అన్నలు కాజేయొద్దంటే ఏం చేయాలి? ఓ సోదరి ప్రశ్న !మధ్య తరగతి కుటుంబం. నలుగురు అన్నలు. నేనే చిన్నదాన్ని. నాన్న మరణం తర్వాత మా కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. అన్నలు దారి తప్పారు. నిత్యం మద్యం మత్తులో జోగుతుంటారు.
మాది మధ్య తరగతి కుటుంబం. నలుగురు అన్నలు. నేనే చిన్నదాన్ని. నాన్న మరణం తర్వాత మా కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. అన్నలు దారి తప్పారు. నిత్యం మద్యం మత్తులో జోగుతుంటారు. నాకు చదువు అంటే ప్రాణం. నాలుగు ఇండ్లలో అంట్లు తోముతూ ఇంటర్ వరకూ చదువుకున్నాను. ప్రైవేట్‌గా డిగ్రీ చేయాలని ఉంది. ఈ మధ్యే నాకు ఓ లాయర్ నుంచి ఫోన్ వచ్చింది. మా నాన్న వైపు నుంచి నాకు నాలుగు కోట్ల రూపాయల ఆస్తి వారసత్వంగా వచ్చిందని చెప్పారు. ఈ ఆస్తితో మా అన్నలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ వ్యవహారంలో తలదూర్చి డబ్బంతా కాజేయాలని చూస్తున్నారు. ఇవ్వకపోతే ఎంతకైనా తెగించేలా ఉన్నారు. ఇస్తేనేమో.. నేను మళ్లీ పేదరికంలో మగ్గిపోవాలి. నా కలల్ని నిజం చేసుకునే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి?
– ఓ సోదరి
మీ నిర్ణయం సరైందే. న్యాయవాదికి మీ పరిస్థితిని వివరించండి. మీరు అందుకోబోయే ఆస్తికి చట్టపరమైన రక్షణ కల్పించమని అడగండి. మీకు ప్రాణాపాయం ఉన్న విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లండి. వీలైతే ఆ ఇంట్లోంచి వచ్చేయండి. తోడుగా మీ అమ్మగారిని తీసుకురండి. అలా అని, తోబుట్టువులను పూర్తిగా విస్మరించడమూ సరికాదు. తక్షణ అవసరాల కోసం ఎంతో కొంత ఇవ్వండి. లేదంటే, వాళ్ల పిల్లల చదువుల బాధ్యత మీరే తీసుకోండి. బతుకుల్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉంది. ఇదొక జీవితకాలం అవకాశం. సద్వినియోగం చేసుకోండి. అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ అంటూ ఆశచూపించే దళారులను నమ్మకండి. రోజువారీ ఖర్చులకు, చదువులకు అవసరమైన సొమ్ము పక్కన పెట్టి.. మిగతా మొత్తాన్ని సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టండి. మీకు అంతా మంచే జరుగుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

