సంపన్న దేశాల్లోనూ సమస్యే
గర్భధారణ సమయంలో తగినన్ని పోషకాలు తీసుకోకపోతే, కాబోయే తల్లి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేనా! పుట్టబోయే బిడ్డ రోగ నిరోధక శక్తి దెబ్బతినే ఆస్కారమూ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటామని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గర్భధారణ సమయంలో తగినన్ని పోషకాలు తీసుకోకపోతే, కాబోయే తల్లి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేనా! పుట్టబోయే బిడ్డ రోగ నిరోధక శక్తి దెబ్బతినే ఆస్కారమూ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటామని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు బ్రిటన్, న్యూజిలాండ్, సింగపూర్‌లోని 1,700 మంది గర్భిణుల ఆరోగ్యాన్ని విశ్లేషించారు. పేద దేశాల గర్భిణుల్లోనే పోషకాల సమస్య అధికమనే అపోహ ఉంది.
నిజానికి, ధనిక దేశాల్లో కూడా పోషక విలువల లోపం కనిపిస్తుంది. విటమిన్-బి12, బి6, డితో పాటు రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్ లాంటి పోషకాలూ లోపిస్తున్నట్టు తేలింది. ఏకంగా 90 శాతం మందిలో ఏదో ఒక పోషక లోపం బయటపడింది. ఇందుకు కారణమూ స్పష్టమే. సంపన్న దేశాల గర్భిణులు జంక్‌ఫుడ్ వలలో పడిపోయి.. మాంసాహారం, పాల పదార్థాల నుంచి వచ్చే ప్రత్యేక పోషకాలను తీసుకోవడం లేదు. ఫలితంగా అన్నీ ఉన్నా ఒకరు, ఏమీ లేక మరొకరు.. పోషకాల సమస్యలపాలు అవుతున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

