Home Decoration | ఇల్లు ఓ కల. దాన్ని ఎంత చక్కగా అలంకరించుకుంటే, అంత అందమైన కలలా మారుతుంది. గృహాలంకరణ కోసం వైవిధ్యమైన వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో చెప్పుకోవాల్సింది ‘నేచర్ రివేర్’ గురించి. లోహంతో రూపొందించే ఈ ఫ్రేమ్స్‌లో సీతాకోకచిలుకల నుంచి పూలరెమ్మల వరకు రకరకాల ఆకృతులను రూపొందిస్తున్నారు. వాటికి అనువైన రంగులద్ది, సహజమైన రూపాన్ని తీసుకొస్తారు.
అడవులు, సముద్రాలు, నదీనదాలు, ఆకాశం… ఎంత పెద్ద దృశ్యమైనా, ఈ చిన్నపాటి ఫ్రేమ్‌లో ఇమిడిపోవాల్సిందే. వేదాస్ ఎక్స్‌పోర్ట్స్ అందిస్తున్న ఈ ఫ్రేమ్స్‌ను చేయితిరిగిన కళాకారులు డిజైన్ చేస్తున్నారు. ఫ్రేమ్స్ మాత్రమే కాకుండా… ప్రకృతిని పోలిన టేబుల్ టాప్స్, వాల్ హ్యాంగింగ్స్ లాంటివీ తయారు చేస్తున్నారు. రెండున్నర వేల నుంచి పదివేల వరకు ధర పలికే ఈ ఆకృతులు
ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.