ఓ తోబుట్టువులానే చూశా.. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఎలా?
పుట్టి పెరిగింది సంప్రదాయ కుటుంబంలోనే అయినా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇంట్లో నా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోవడం లేదు. మా మేనబావతో వివాహం జరిపించాలని చూస్తున్నారు.
పుట్టి పెరిగింది సంప్రదాయ కుటుంబంలోనే అయినా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇంట్లో నా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోవడం లేదు. మా మేనబావతో వివాహం జరిపించాలని చూస్తున్నారు. పెండ్లికి ఒప్పుకోమని బలవంతం చేస్తున్నారు. అతను మంచివాడే. కానీ మా అన్నయ్యలతో పాటుగా పెరిగాడు. తననూ ఓ తోబుట్టువులానే చూశాను. ఇప్పుడు భర్తగా జీవితంలోకి ఆహ్వానించమంటే ఎలా? కన్నవాళ్లను ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు.
- ఓ సోదరి
మీ అభిప్రాయం అన్ని విధాలా సరైందే. ఇద్దరి మనసులు కలిస్తేనే అది వివాహం అవుతుంది. దాంపత్య జీవితమూ సజావుగా సాగుతుంది. నిన్నటిదాకా సోదరుడిలా భావించిన వ్యక్తిని.. మూడుముళ్లు పడగానే భర్తగా అంగీకరించడం అసాధ్యం. జన్యుశాస్త్ర పరంగా కూడా.. దగ్గరి సంబంధాలు మంచివి కాదు. ఇదే మాట మీ ఇంట్లో చెప్పండి. వీలైతే మీ ఫ్యామిలీ డాక్టర్‌తోనూ చెప్పించండి. మీ ఆమోదం లేకుండా మీ పెళ్లి జరగదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అవసరమైతే పోలీసుల సహకారమూ తీసుకోండి. మీ చదువు, ఉద్యోగం గురించి చెప్పనే లేదు. ముందు ఆర్థికంగా స్థిరపడండి. ఆ తర్వాతే వివాహం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

