అందాల లోకాన్ని శాసించేది పింక్ కలరే! అధరాలకు గులాబీ రంగు హంగులు చేర్చే అతివలు సిగ్గుపడితే బుగ్గలపైకి చేరి పిల్లిమొగ్గలేసేదీ ఈ వర్ణమే! అందుకే, గోళ్ల రంగు నుంచి హెయిర్ బ్యాండు వరకు గులాబీనే వనితల తొలి ఎంపిక. గులాబీ సోకంత సుకుమారంగా ఉండే కథానాయిక హన్సిక తాజాగా పింక్ వన్నె చీరకట్టి కనికట్టు చేసింది. తాజా ఫొటో సిరీస్ను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఇంతి కాంతి… గులాబీకి గిలిగింతలు పెట్టించేలా ఉందంటున్నారు అంతా!