మీ బంధంలోనూ గ్రీన్ఫ్లాగ్స్
ప్రేమ, పెళ్లి బంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామంది రెడ్ ఫ్లాగ్స్ (ప్రమాదకర లక్షణాలు) గురించే చర్చిస్తుంటారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, మానసికంగా అందుబాటులో ఉండకపోవడం, వేధించడం వంటి నెగెటివ్ అంశాలపైనే ఆలోచనలుంటాయి.
ప్రేమ, పెళ్లి బంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామంది రెడ్ ఫ్లాగ్స్ (ప్రమాదకర లక్షణాలు) గురించే చర్చిస్తుంటారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, మానసికంగా అందుబాటులో ఉండకపోవడం, వేధించడం వంటి నెగెటివ్ అంశాలపైనే ఆలోచనలుంటాయి. కానీ, ఒక ఆరోగ్యకరమైన బంధం నిలబడాలంటే పరస్పర గౌరవం, మానసిక పరిణతితోపాటు ఇరువైపులా ప్రయత్నం ఉండాలి. వీటినే మనం గ్రీన్ ఫ్లాగ్స్ (సానుకూల లక్షణాలు) అంటాం. మీ పార్ట్నర్తో మీ బంధం లాంగ్న్ల్రో సక్సెస్ అవుతుందో లేదో తెలిపే పాజిటివ్ లక్షణాలు ఇవి..
తప్పులను ఒప్పుకోండి: భావోద్వేగపరంగా ఒకరినొకరు నమ్మాలంటే భాగస్వామికి తన తప్పులను అంగీకరించే గుణం ఉండాలి. చాలా బంధాలలో గొడవలు రావడానికి కారణం పొరపాట్లు చేయడం కాదు, చేసిన పొరపాటును ఒప్పుకోకపోవడం. తన ప్రవర్తనను తాను సమీక్షించుకుంటూ బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తితో బంధం కలకాలం నిలుస్తుంది. చేసిన పొరపాటుకు అహానికి పోకుండా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం, తమ ప్రవర్తనను తాము మార్చుకోవడానికి సిద్ధపడటం పార్ట్నర్లో కనిపించే అతిపెద్ద గ్రీన్ ఫ్లాగ్.
గొడవలకు విరామం: ఎంతటి అన్యోన్య దంపతుల మధ్యనైనా విభేదాలు రావడం సహజం. అయితే లాంగ్టర్మ్ రిలేషన్షిప్లో గొడవలు రాకుండా చూసుకోవడం కంటే, వచ్చిన గొడవలను ఎలా పరిషరించుకుంటున్నారనేదే ముఖ్యం. ఎదుటివారిని తకువ చేసి మాట్లాడకుండా, అహంకారానికి పోకుండా పరస్పర గౌరవంతో మాట్లాడుకోవడం అవసరం.
వివేకంతో..: ప్రస్తుత కాలంలో చాలామంది గమనించని మరో ముఖ్యమైన గ్రీన్ ఫ్లాగ్.. సందర్భాన్ని బట్టి స్పందించే వివేకం. మెకానికల్ గానో లేదా డిఫెన్సివ్ గానో రియాక్ట్ అవ్వకుండా, ఆ సమయంలో భాగస్వామికి ఏం కావాలో అర్థం చేసుకోవడమే దీని ప్రత్యేకత.
ఫీడ్ బ్యాక్ తీసుకోండి: జీవితంలో తమకు అన్నీ తెలుసనే అహంకారం లేకుండా, భాగస్వామి ఇచ్చే ఫీడ్ బ్యాక్ను స్వీకరిస్తూ వ్యక్తిగతంగా ఎదిగేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రవర్తనలో మార్పులేని మొండితనం కంటే, కలిసి మారాలనే తపన బంధాన్ని బలోపేతం చేస్తుంది. దీనితో పాటు బంధంలో భావోద్వేగ భద్రత చాలా ముఖ్యం. మన భయాలు, అవసరాలు, ఆవేదనలను భాగస్వామి ముందు నిర్భయంగా పంచుకోగలగాలి. మనసులో ఉన్నది చెబితే ఎకడ అవమానిస్తారో లేదా తప్పుగా అర్థం చేసుకుంటారో అనే భయం బంధంలో ఉండకూడదు. సుదీర్ఘమైన బంధాలు పరిపూర్ణత మీదో లేదా నిరంతర శృంగారభరితమైన ఊహల మీదో నిర్మితం కావు. అవి కేవలం పరస్పర గౌరవం, అవగాహన, మానసిక పరిణతి, బంధాన్ని కాపాడుకోవాలనే నిరంతర ప్రయత్నంతోనే సాధ్యమవుతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

