గూగుల్ మ్యాప్స్.. ఇక జవాబు చెబుతుంది!
ఆ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉంది? పార్కింగ్ సౌకర్యం ఉందా? ఈ దారిలో ట్రాఫిక్ ఎంత? అక్కడికి చేరుకోవడానికి సరైన సమయం ఏది?.. ఇలాంటి ప్రశ్నలు మన ప్రయాణాలప్పుడు తరచుగా వస్తుంటాయి.
ఆ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉంది? పార్కింగ్ సౌకర్యం ఉందా? ఈ దారిలో ట్రాఫిక్ ఎంత? అక్కడికి చేరుకోవడానికి సరైన సమయం ఏది?.. ఇలాంటి ప్రశ్నలు మన ప్రయాణాలప్పుడు తరచుగా వస్తుంటాయి. ఇప్పటి వరకు వీటికి జవాబు కోసం వేర్వేరు యాప్స్, రివ్యూస్ చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు! గూగుల్ మ్యాప్స్ ఇకపై కేవలం దారి మాత్రమే చూపించదు.. మీ ప్రశ్నలకు కూడా జవాబు చెబుతుంది.. గూగుల్ ప్రవేశపెట్టిన ‘ఇమ్మర్సివ్ వ్యూ ఫర్ రూట్స్’ (Immersive View for Routes), ‘ఆస్క్ మ్యాప్స్’ (Ask Maps) లాంటి ఫీచర్లు మన ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి.
ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్‌లో మీరు లొకేషన్ సెర్చ్ చేస్తే.. అది దారి, సమయం, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. కానీ ‘Ask Maps‘తో ఇకపై మీరు సహజమైన భాషలో ప్రశ్నలు అడగవచ్చు! ఉదాహరణకు.. ఈ కాఫీ షాప్ లో వై-ఫై ఉందా? ఈ మ్యూజియం చూడటానికి ఎంత సమయం పడుతుంది? ఈ హోటల్లో పెట్ ఫ్రెండ్లీ రూమ్స్ ఉన్నాయా? ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది? ఇలా ఇవన్నీ అడిగేయొచ్చు. మీ మాటల్ని AI అర్థం చేసుకుని జవాబు ఇస్తుంది.

ఫొటోలకు మించిన అనుభవం!
గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ ‘Immersive View’ (ఇమ్మర్సివ్ వ్యూ). ఏఐ సాయంతో వేల ఫొటోలను కలిపి ఒక ప్రదేశం త్రీడీ రూపాన్ని గూగుల్ సృష్టించింది. ఈ ఫీచర్లో ఒక చిన్న ైస్లెడర్ ఉంటుంది. దాన్ని జరిపితే.. ఆ ప్రదేశం మధ్యాహ్నం పూట ఎలా ఉంటుంది? రాత్రి వేళ ఎలా ఉంటుంది? వర్షం పడితే అక్కడి రోడ్లు ఎలా కనిపిస్తాయి? అన్నీ చూపుతుంది. దీంట్లోని ప్రత్యేకతల విషయానికొస్తే..
- ఒక ప్రదేశం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎలా ఉంటుందో చూడవచ్చు.
- వాతావరణ పరిస్థితులు తెలుసుకోవచ్చు.
- రెస్టారెంట్స్, మ్యూజియమ్స్ లోపలి దృశ్యాలు 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు.
ప్లానింగ్‌లో హెల్పింగ్ హ్యాండ్
టెక్నాలజీ మనల్ని దూరం చేయడమే కాదు.. ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చి దగ్గర చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఇమ్మర్సివ్ వ్యూ అనేది కేవలం ఒక ఫీచర్ కాదు.. అది మన ఊహలకు, వాస్తవానికి మధ్య ఉన్న వారధి. దీంతో మన రోజువారీ పనులు ఇట్టే చక్కబెట్టేసుకోవచ్చు.
సమయం ఆదా: వేర్వేరు యాప్స్, వెబ్‌సైట్స్ చూడాల్సిన అవసరం లేదు.. ఒక్క మ్యాప్స్ ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు.
బెటర్ డెసిషన్స్: కేవలం రివ్యూస్ చదవడం కాదు.. నిజమైన దృశ్యాలు చూసి నిర్ణయం తీసుకోవచ్చు..
యాక్సెసిబిలిటీ: దివ్యాంగులకు, వృద్ధులకు.. ఆ ప్రాంతం ఎంత యాక్సెసిబుల్ అని ముందే తెలుసుకోవచ్చు.
ఎలా వాడాలి?
Step 1: గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి.
Step 2: మీకు కావాల్సిన లొకేషన్ సెర్చ్ చేయండి.
Step 3: ‘Ask Maps’ ఐకాన్ మీద క్లిక్ చేయండి (లేదా మైక్ ఐకాన్).
Step 4: మీ ప్రశ్న అడగండి (టైప్ చేయవచ్చు లేదా వాయిస్ ద్వారా).
Step 5: ఇమ్మర్సివ్ వ్యూ కోసం..‘Immersive View’ బటన్ పై క్లిక్ చేయండి
Step 6: సమయం,వాతావరణం ఆప్షన్స్ ఎంచుకొని వివరాలు తెలుసుకోవచ్చు.
త్వరలో మరిన్ని ఫీచర్స్
- ఫోన్ కెమెరా ద్వారా రియల్-టైమ్‌లో దారి చూపిస్తుంది.
- మీ ప్రాధాన్యాల ఆధారంగా సూచనలు వస్తాయి.
- ఆ ప్రాంతంలో జరిగే ఈవెంట్స్‌పై రియల్-టైమ్ అప్డేట్స్ పొందవచ్చు.
- మ్యాప్స్‌లో కొత్త ఫీచర్స్ యాక్సెస్ చేయాలంటే లేటెస్ట్ వెర్షన్‌కి అప్డేట్ చేసుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

