Fertility rate | పాపాయి నవ్వు కనిపించదేమి.. ప్రపంచ దేశాల్లో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు..
Fertility rate | ఇంట్లో పాపాయి బోసి నవ్వులు చూడాలని ఏండ్లకేండ్లు ఎదురుచూస్తున్న దంపతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే దీనికి కారణం. 1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది.
- 60 ఏండ్లలో 5 నుంచి 2.4కు పడిపోయిన వైనం
- దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే ప్రమాదం
- భారత్‌లోనూ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు
- మారిన ఆహారపుటలవాట్లు, యాంత్రిక జీవనశైలి పని ఒత్తిడి, ఆందోళనే కారణమంటున్న నిపుణులు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఇంట్లో పాపాయి బోసి నవ్వులు చూడాలని ఏండ్లకేండ్లు ఎదురుచూస్తున్న దంపతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే దీనికి కారణం. 1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది. 2021నాటికి అది 2.4కు పడిపోయింది. ఈ మేరకు అమెరికా వార్తాపత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. దక్షిణకొరియాలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 0.75గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో సంతానోత్పత్తి రేటు 1.6గా ఉండగా.. భారత్‌లో 1.98గా, చైనాలో 1,7గా ఉన్నట్టు వివరించింది.
భారత్‌లోనూ తగ్గుదల
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతున్నదని, సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే దీనికి కారణమని ‘లాన్సెట్’ ఇటీవలి ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో 1950లో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉండేదని.. 2021నాటికి అది 2 కంటే తక్కువకు పడిపోయినట్టు వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, అదే 2100నాటికి 1.04కు పడిపోవచ్చని హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వెరసి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సంతానోత్పత్తి రేటులో తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశ బడ్జెట్లో సగం
దక్షిణకొరియాలో జననాల రేటు క్రమంగా పడిపోతున్నది. భవిష్యత్తులో ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపైనే దుష్ప్రభావం చూపించే ప్రమాదమున్నదని గ్రహించిన అక్కడి ప్రభుత్వం ఓ స్కీమ్‌ను తీసుకొచ్చింది. జంటలను సంతానం విషయంలో ప్రోత్సహించడానికి.. ఒక బిడ్డ పుడితే 100 మిలియన్ వన్ (సుమారు రూ. 60 లక్షలు) ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. దీని కోసం రూ. 1.3 లక్షల కోట్లను పక్కనబెట్టాలనుకొంటున్నది. ఇది ఆ దేశ బడ్జెట్లో దాదాపు సగం.
టెస్టోస్టిరాన్ తగ్గితే..
టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు తక్కువగా ఉండే పురుషులు త్వరగా మరణించే ప్రమాదమున్నదని తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. ఈ హార్మోన్ తక్కువగా ఉత్పత్తయ్యే పురుషులకు గుండె సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదమున్నదని, ఇది మరణానికి దారితీయవచ్చని వివరించింది. ఈ వివరాలు ‘అన్నాల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమ్యాయి.

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

