మనసున ఉన్నదీ..
నేను ఓ టీనేజ్ అమ్మాయిని. ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. నా మనసులోని మాట తనతో ఎప్పుడూ చెప్పలేదు. మౌనంగానే ఆరాధిస్తున్నా. నా బెస్ట్‌ఫ్రెండ్ ఈ మధ్య అతనికి దగ్గరైంది. డేటింగ్ వెళ్లినట్టు సమాచారం.
నేను ఓ టీనేజ్ అమ్మాయిని. ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. నా మనసులోని మాట తనతో ఎప్పుడూ చెప్పలేదు. మౌనంగానే ఆరాధిస్తున్నా. నా బెస్ట్‌ఫ్రెండ్ ఈ మధ్య అతనికి దగ్గరైంది. డేటింగ్ వెళ్లినట్టు సమాచారం. ఇద్దరూ చనువుగా ప్రవర్తించిన ప్రతిసారీ నా గుండె రగిలిపోతుంది. ప్రాణ స్నేహితురాల్ని పోగొట్టుకోలేను. ఇటు ప్రేమించిన వాణ్నీ వదులుకోలేను. నన్నేం చేయమంటారు చెప్పండి. ఆలోచించీ ఆలోచించీ బుర్ర వేడెక్కిపోతున్నది.
– ఓ పాఠకురాలు
నిజమే. మీరు ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. స్నేహం దెబ్బతినకుండానే సమస్యను పరిష్కరించుకునే మార్గం ఆలోచించండి. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. నిదానంగానే మీ మనసులోని మాట ఆమెతో చెప్పండి. అపార్థం చేసుకోవద్దని అభ్యర్థించండి. అదే సమయంలో అతని మనసులో మీరు ఉన్నారా లేదా అన్నది తెలుసుకోండి. ఓ కాఫీడే మీటింగ్ చాలు అతని అంతరంగాన్ని గ్రహించడానికి. ఎవరికి తెలుసు, ఆ ఇద్దరిదీ కేవలం స్నేహమే కావచ్చు. నిజంగా ప్రేమే అయితే మాత్రం.. మీరు నిశ్శబ్దంగా నిష్క్రమించడమే మంచిది. మీ భావాలను, అభిరుచులను గౌరవించే వాలెంటైన్ తప్పకుండా దొరుకుతాడు. అంతర్ముఖులు ఎప్పుడూ ప్రేమలో విజయం సాధించలేరు. వైఫల్య భయంతోనో, మరో కారణంతోనో మనసులోనే మురగబెట్టుకుంటే.. ఉపయోగం లేదు. ఆ రాకుమారుడికి ఇంకెవరో వల వేస్తారు. స్పష్టమైన ఆలోచనతో, ధైర్యంగా నిర్ణయం తీసుకోండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Girl Thinking
- Thinking
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

