అసలైన పార్టీలుక్ రావాలంటే క్రాప్‌టాప్ ధరించాల్సిందే. అప్పుడే భారతీయత ఉట్టిపడేలా కనిపిస్తూనే, మోడ్రన్ మెరుపుల్నీ మెరిపించవచ్చు. అలాంటి ప్రత్యేక సందర్భాల కోసం రూపొందించిందే ఈ ఫ్యూజన్ వైట్ లెహంగా క్రాప్‌టాప్.ఆఫ్‌వైట్ ఆర్గంజా వస్ర్తాన్ని ఎంచుకొని నాజూకైన ఫ్లోరల్హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు.
క్రాప్‌టాప్‌తో పాటు నడుము పట్టీమీదా వచ్చిన ఈ డిజైన్‌ను ఊదా, గులాబీ, ఆలివ్ గ్రీన్, బంగారు, వెండి వర్ణాల కలయికతో కళాత్మకంగా రూపొందించారు. నడుము దగ్గర రెండువైపులా రిబ్బన్లు అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.
-సమతా చౌదరి, డిజైనర్
wowobySamathachowdari