పాత కూలర్లు వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి
సమ్మర్ వచ్చేసింది! అటక మీద పడేసిన.. మూలకు పెట్టిన ఎయిర్ కూలర్లను బయటకు తీస్తున్నారా? అయితే పాత కూలర్లతో ఎక్కువ చల్ల గాలి రావాలంటే

సమ్మర్ వచ్చేసింది! ఉక్కపోత మొదలైంది!! ఈ ఎండ వేడికి ఫ్యాన్ గాలి సరిపోతనే లేదు. అందుకే అటక మీద పడేసిన.. మూలకు పెట్టిన ఎయిర్ కూలర్లను బయటకు తీస్తున్నారా? అయితే పాత కూలర్లతో ఎక్కువ గాలి, చల్లదనం రావాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా మీ పాత కూలర్ల కిందే ఎక్కువ కూల్‌గా ఉండొచ్చు.. అవేంటో చూద్దామా..
గదిలో వెంటిలేషన్ ఉండాలి
రూంలో తలుపులు, కిటికీలు మూసేస్తే కూలర్, ఏసీ గాలి బయటకు పోదు.. దీనివల్ల గది మొత్తం చల్లగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. గాలి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోతే హ్యుమిడిటీ(తేమ) మొత్తం గదిలో నిండిపోతుంది. దీనివల్ల శరీరం జిడ్డుగా మారి చికాకు పెడుతుంది. అందుకే తేమ బయటకు వెళ్లాలంటే కూలర్లను కిటికీ ముందు పెట్టడం మంచిది. ఒకవేళ కిటికీ పెద్దగా ఉంటే కిటికీని కొంచెం మూసేయొచ్చు.
ఐస్ వాటర్ వాడండి
కూలర్లలో నుంచి గాలి మరింత చల్లగా రావాలంటే.. కూలర్ ట్యాంక్‌లో చల్లటి నీళ్లు పోయాలి. లేదా నీటిలో ఐస్ వేసిన సరిపోతుంది. కొన్ని కూలర్లలో అయితే ఐస్ వేసేందుకు ప్రత్యేకంగా ఒక ఏర్పాటు కూడా ఉంటుంది. ఇలా చేయడం వల్ల సాధారణం కంటే కొద్దిగా చల్లటి గాలి వస్తుంది. అంతేతప్ప గది మొత్తం చల్లబడదు. అలాగే చల్లటి గాలి వస్తుంది కదా అని ఎక్కువగా ఐస్ కూడా వేయకూడదు. అలా ఎక్కువ ఐస్ వేయడం వల్ల కూలర్ పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి బాగా ఉక్కపోతగా ఉన్నప్పుడు మాత్రమే ఐస్‌ను వాడాలి.
తరచూ శుభ్రం చేయాలి
చాలామంది ఎండాకాలం అయిపోగానే ఎయిర్ కూలర్లను అటకపై పడేస్తారు. మళ్లీ సమ్మర్ మొదలవ్వగానే వాటిని తీసి వాడుతుంటారు. సీజన్లో తొలిసారి కూలర్‌ను బయటకు తీసినప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కూలింగ్ ప్యాడ్స్‌ను శుభ్రం చేయాలి. ట్యాంక్ లీకేజీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్యాన్ బ్లేడ్స్‌ను కూడా శుభ్రంగా కడగాలి.
కూలింగ్ ప్యాడ్స్ తడపాలి
ఎయిర్ కూలర్లో నీళ్లు నింపుతున్న సమయంలోనే పంప్‌ను ఆన్ చేయాలి. అప్పుడు పంప్ రన్ అవ్వగానే కూలింగ్ ప్యాడ్లు నీటితో తడుస్తాయి. దీనివల్ల మనం కూలర్ ఆన్ చేసేలోపు కూలింగ్ ప్యాడ్స్ తడిసిపోయి ఉంటాయి. దీంతో కూలర్ ఆన్ చేయగానే చల్లటి గాలి వస్తుంది. వీటితో పాటు రూంలోకి ఎండ రాకుండా కర్టెన్లు వేయడం, గదిలో తక్కువ సామన్లు ఉండేలా చూసుకోవడం ద్వారా కూడా రూం త్వరగా చల్లబడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఎండలో 5 గంటలకు మించి ఉంటే సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సిందే..!
ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

