స్ట్రెచ్ మార్క్స్ వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే
Beauty tips | స్ట్రెచ్ మార్క్స్. మహిళలను బాగా ఇబ్బందికి గురిచేసే సమస్యల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా గర్బధారణ సమయంలో మహిళల పొట్టపై ఈ స్ట్రెచ్ మార్క్స్
స్ట్రెచ్ మార్క్స్. మహిళలను బాగా ఇబ్బందికి గురిచేసే సమస్యల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా గర్బధారణ సమయంలో మహిళల పొట్టపై ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ఇంతకూ స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంది అనుకుంటున్నారా? అదేనండీ పొట్టపై చారలు ఏర్పడటం. ఈ పొట్టపై చారలు ఏర్పడటం అనేది పెద్ద అనారోగ్య సమస్య కాకపోయినా.. తమ అందానికి మచ్చ తెచ్చేలా వికారంగా కనిపిస్తాయని మహిళలు బాధపడుతుంటారు.
స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి..?
గర్బధారణ సమయంలో కడుపులో బిడ్డ పెరిగినాకొద్ది పొట్ట సాగుతుంది. దాంతో పొట్ట మీది చర్మం సాగి చారలు ఏర్పడుతాయి. ప్రసవం తర్వాత పొట్టభాగం యథాస్థితికి వచ్చినా ఈ చారలు పోవు. కాకపోతే కొద్దిగా సన్నబడుతాయి. ఈ చారల సమస్య మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ చారలను పోగొట్టుకోవడానికి వారు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు వైద్యులను కూడా సంప్రదిస్తారు. అయినా ప్రయోజనం ఉండదు.
వంటింటి చిట్కాలతో పరిష్కారం..
అయితే, ఇంతటి మొండి సమస్యను కేవలం కొన్ని వంటింటి చిట్కాలు పాటించడంతో పరిష్కరించుకోవచ్చట. ఎంతో మంది మహిళలు ఈ చిట్కాలు పాటించి సక్సెస్ అయ్యారట. వాటిలో బాగా సక్సెస్ రేటు ఉన్న రెండు వంటింటి చిట్కాల గురించి మనం కూడా తెలుసుకుందాం..
మొదటి చిట్కా: స్నానం చేయడానికి గంట ముందు ఆముదం నూనెను గోరువెచ్చగా చేసుకుని చారలు ఉన్నచోట తైలమర్దన చేయాలట. ఇలా తైలమర్దన చేసిన తర్వాత గంట సేపటికి స్నానం చేయాలట. ఇలా ప్రతిరోజు చేస్తూ పోతే నాలుగు వారాల్లో తప్పకుండా ఫలితం కనిపిస్తుందట.
రెండో చిట్కా: ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు బాదాం నూనెతో చారలపై మర్దన చేసుకోవాలట. మరుసటి రోజు ఉదయాన్నే వేడి నీటితో స్నానం చేసి, చారలపై కలబంద గుజ్జు రాసుకోవాలట. ప్రతిరోజు ఇలా చేస్తే నాలుగైదు వారాల్లోనే మంచి ఫలితం ఉంటుందట.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

