మీ వంటింట్లో.. ఇవి ఉన్నాయా?
ఉదయం లేవగానే ఇంటి పనులతోపాటు వంట చేసుకుని పిల్లలకు బాక్సులు కట్టి, ఆఫీస్‌కు క్యారేజీ సిద్ధం చేసుకొని పొలోమని పరిగెత్తడం ఇంటింటా సర్వసాధారణమే! అరగంట ఆలస్యంగా నిద్ర లేచామా..
ఉదయం లేవగానే ఇంటి పనులతోపాటు వంట చేసుకుని పిల్లలకు బాక్సులు కట్టి, ఆఫీస్‌కు క్యారేజీ సిద్ధం చేసుకొని పొలోమని పరిగెత్తడం ఇంటింటా సర్వసాధారణమే! అరగంట ఆలస్యంగా నిద్ర లేచామా.. ఆ రోజు బాక్సులోకి పచ్చడి మెతుకులే గతి! అలాంటి సమయంలో ఇబ్బంది లేకుండా మార్కెట్లోకి వచ్చినవే స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్. తక్కువ టైమ్‌లో ఎక్కువ వంటలు వండి వార్చే ఆ గ్యాడ్జెట్స్ ఏంటో మీరూ ఓ లుక్కేయండి.
మల్టీ కుక్కర్
ఒక్కో వంటకానికి ఒక్కో కుక్కర్, పాత్రలు వాడే అవసరం లేకుండా అన్నిరకాల వంటల్ని వండేందుకు అనువైనదే ఈ మల్టీ కుక్కర్. ఈ ఒక్క కుక్కర్‌తో అన్నం, ఇడ్లీ, సాంబార్, మ్యాగీ, కూరలు.. ఇలా అన్నిరకాల వంటలు చేసుకోవచ్చు. ఇన్‌బిల్ట్ బౌల్‌తో అందుబాటులో ఉన్న దీన్ని శుభ్రం చేయడం కూడా తేలిక. వర్కింగ్ ఉమెన్స్‌కి, బ్యాచ్‌లర్స్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది.
పాప్‌కార్న్ మేకర్

చిన్నాపెద్దా తేడా లేకుండా ఎక్కువగా ఇష్టపడే స్నాక్స్‌లో ఒకటి పాప్‌కార్న్. బయటికెళ్తే వందలు పెడితే గానీ గుప్పెడు పాప్‌కార్న్ రాదు. ఈ ఖర్చును నియంత్రించేలా పాప్‌కార్న్ మేకర్ కొంటే సరి. ఏ కల్తీ లేకుండా ఇంట్లోనే పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ నిమిషాల్లో సిద్ధం చేసేయొచ్చు.
స్టీల్ చాపింగ్ బోర్డ్

వంటింట్లో ఎక్కువగా వాడే వస్తువుల్లో ఒకటి చాప్ బోర్డ్. ఏ వంట చేయాలన్నా ముందుగా కూరగాయలు తరగాల్సిందే. అయితే చెక్కతో చేసిన చాప్ బోర్డ్ తరచుగా తడపడం వల్ల వాసన వస్తుంది. ఇక ఫైబర్, ప్లాస్టిక్ చాప్బోర్డ్ల వాడకం వల్ల వాటిలోని రేణువులు వంటలో కలిసే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నిటికీ స్టీల్ చాపింగ్ బోర్డ్‌తో చెక్ పెట్టేయచ్చు. ఏ చింతా లేకుండా స్టీల్ బోర్డ్‌పై చక్కగా కూరలు తరిగి వంటపాత్రల మాదిరిగానే శుభ్రం చేసి పెట్టుకుంటే సరి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

