చౌమహల్లా సారీలో దీపిక!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు అనేకమంది ప్రముఖులు, బాలీవుడ్ తారలు హాజరవుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు అనేకమంది ప్రముఖులు, బాలీవుడ్ తారలు హాజరవుతున్నారు. అంబానీల స్థాయికి తగినట్లే ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా మెహతాతో పాటు ఈ పెండ్లి వేడుకలకు హాజరవుతున్న తారలందరు ధరిస్తున్న దుస్తులు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ క్రమంలో దీపికా పదుకొణె ధరించిన పర్పుల్ చీర వార్తల్లో నిలిచింది. తొరానీ సంస్థ రూపొందించిన ఈ చీర తయారీకి ఏకంగా 3,400 గంటల సమయం పట్టిందట. అంతేకాదు హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్, కరాచీలోని చౌఖండీ టూంబ్స్ వాస్తుకళను స్ఫూర్తిగా తీసుకుని ఈ చీరను తయారు చేశారట. ముచ్చటైన ఎంబ్రాయిడరీతో ముస్తాబు చేసిన సారీపై ముత్యాలు, డోరీలు పొదిగారు. జరీ వర్క్ మేళవింపుతో రూపొందించిన చీర కట్టుకున్న దీపిక దానిపైకి డీప్ నెక్ లైన్, హాఫ్ లెంగ్త్ స్లీవ్స్ బ్లౌజ్ ధరించి అదరహో అనిపించింది. తొమ్మిది గజాల చీరకట్టులో బేబీబంప్తో మరింత అందంగా మెరిసిపోయింది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

