ఆ నొప్పి ఎందుకు?
మస్తే డాక్టర్. నా వయసు 41 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. ఇటీవల నెలసరి ముందు రోజుల్లో రొమ్ములు విపరీతంగా నొప్పి చేస్తున్నాయి. నడిచినా, ఏదైనా తగిలినా తట్టుకోలేకపోతున్నా.
నమస్తే డాక్టర్. నా వయసు 41 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. ఇటీవల నెలసరి ముందు రోజుల్లో రొమ్ములు విపరీతంగా నొప్పి చేస్తున్నాయి. నడిచినా, ఏదైనా తగిలినా తట్టుకోలేకపోతున్నా. రాత్రిపూట కూడా బ్రా వేసుకుని పడుకోవాల్సి వస్తున్నది. నా సమస్య ఏమిటి? ఎందుకిలా జరుగుతున్నది?
-ఓ పాఠకురాలు
నెలసరికి ముందు వక్షోజాల్లో నొప్పి, రొమ్ములు బరువు చేయడంలాంటి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీన్ని ‘ప్రీ మెన్స్ట్రువల్ మాస్టా ల్జియా’గా పిలుస్తారు. ఒక వయసు వచ్చాక అండం విడుదల సమయంలో వెలువడే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఈ నొప్పికి కారణం. ముప్పైలు దాటిన స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. శరీర తత్వాన్ని బట్టి కొందరిలో నెలసరికి ముందు, మరికొందరిలో తర్వాత, ఇంకొందరిలో రెండు నెలసరుల మధ్య ఈ నొప్పి ఉంటుంది. అయితే ఇది క్యాన్సర్ వ్యాధికి గుర్తేం కాదు. పెద్దగా భయపడనక్కర్లేదు. నొప్పి మరీ ఎక్కువైతే గైనకాలజిస్టును సంప్రదించండి. నలభైలలో ఉన్నారు కాబట్టి, సోనోమామోగ్రామ్ పరీక్ష చేయించుకుంటే ఇంకా మంచిది.
- డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

