Niharika | ఫ్రాన్స్‌లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్నది. ఫ్రెంచ్ రివెరాలో కొనసాగుతున్న 77వ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ తారలు రెడ్‌కార్పెట్‌పై మెరిసిపోతున్నారు. పంచవన్నెల దుస్తుల్లో దర్శనమిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. యూట్యూబర్, డిజిటల్ కంటెంట్ రైటర్ నిహారిక ఎన్ఎమ్ ఈ వేడుకలో షో స్టాపర్‌గా కనువిందు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘బిగ్ మౌత్’ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే రెండుసార్లు కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన నిహారిక.. ముచ్చటగా మూడోసారి రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఈ వేడుకలో బ్లూ కలర్ నెట్ డ్రెస్, స్కిన్ కలర్ లైనింగ్ ధరించి క్యాట్ వాక్‌తో అదరగొట్టింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో కలిపి దాదాపు 60 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న నిహారిక ప్రభాస్, మహేశ్‌బాబు లాంటి టాలీవుడ్ స్టార్లతో వీడియోలు చేసి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది.