చూడచక్కని చూరు.. వేలాడే మొక్కల తీరు!
వాకిట్లో పచ్చని మొక్కలను పెంచుకుంటే మానసికంగానూ, శారీరకంగానూ చాలా లాభాలు ఉన్నాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు పచ్చని మొక్కలతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అపార్ట్‌మెంట్‌వాసులకు ఈ ఆనందం అందని ద్రాక్షే!
వాకిట్లో పచ్చని మొక్కలను పెంచుకుంటే మానసికంగానూ, శారీరకంగానూ చాలా లాభాలు ఉన్నాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు పచ్చని మొక్కలతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అపార్ట్‌మెంట్‌వాసులకు ఈ ఆనందం అందని ద్రాక్షే! అందుకే చిట్టి చిట్టి కుండీల్లో పొట్టి పొట్టి మొక్కలు పెట్టుకొని అక్కడితో సంతృప్తిపడుతుంటారు. బాల్కనీలో స్థలం వృథాకాకుండా చూరుకు వేలాడదీసే కుండీలు రకరకాల డిజైన్లలో లభిస్తున్నాయి. అయితే ఈ తరహా వేలాడదీసే కుండీల్లో తీగ మొక్కలు నాటుకుంటే.. మీ బాల్కనీ బృందావనంగా మారిపోతుంది.
పెటూనియా: కుండీలో పెరిగే ఈ పూల మొక్కలను వేలాడదీస్తే చాలా అందంగా కనిపిస్తాయి. పెటూనియాలు గులాబీ, ఊదా, నీలం, తెలుపు.. అందమైన రంగులలో వికసిస్తాయి. ట్రంపెట్ ఆకారంలో ఉండే ఈ పూలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

బోస్టన్ ఫెర్న్: ఈ పందిరి మొక్కలు ఇంటికి కొత్త లుక్ తెస్తాయి. బోస్టన్ ఫెర్న్ మొక్కలు పొదల్లా పెరుగుతాయి. తెల్లవారుజామున ఇవి మరింత అందంగా కనిపిస్తాయి.
పోథోస్ ప్లాంట్: ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. నిర్వహణ కూడా చాలా తేలిక. నెల రోజుల్లోనే ఏపుగా పెరుగుతుంది. మచ్చల ఆకులతో ఇంటికి డిఫరెంట్ లుక్ ఇస్తుంది.
స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్: పేరుకి తగినట్లుగానే ముత్యాలను అమర్చినట్లు అందంగా ఉంటుంది ఈ మొక్క. చిన్న చిన్న బటానీలు కొమ్మలకు అతుక్కుని ఉన్నట్లు కనిపిస్తుంది. వీటికి తెల్లని పూలు కూడా పూస్తాయి. కుండీలో అయినా ఈ మొక్క ఏపుగా ఎదిగి పచ్చదనంతో అలరిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Bostan Fern
- Indian flag
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

