Beauty Tips | మగవాళ్లలా మీసాలు, గడ్డాలు పెరుగుతున్నాయి.. ఏం చేయాలి ?
Beauty Tips | పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తగ్గాలంటే ముందు మీరు బరువు తగ్గాలి. అందులో 75 శాతం డైట్ వల్ల, మిగతా 25 శాతం ఎక్సర్‌సైజ్‌వల్ల తగ్గుతారు. బరువు నియంత్రణ, తద్వారా పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుకోవడం అనేది జీవితకాల పోరాటం.
Beauty Tips | నా వయసు ఇరవై నాలుగు. సాధారణ బరువుకంటే పది కిలోలు ఎక్కువే ఉంటాను. పీసీఓఎస్ సమస్య ఉంది. మగవాళ్లలా మీసాలు, గడ్డాలు పెరుగుతున్నాయి. వారానికి, పదిహేను రోజులకు వ్యాక్సింగ్ చేసుకోవడం అంటే ఇబ్బందే. పీసీఓఎస్ తగ్గితే అవాంఛిత రోమాలు ఆగిపోతాయా?
- ఓ పాఠకురాలు
పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తగ్గాలంటే ముందు మీరు బరువు తగ్గాలి. అందులో 75 శాతం డైట్ వల్ల, మిగతా 25 శాతం ఎక్సర్‌సైజ్‌వల్ల తగ్గుతారు. బరువు నియంత్రణ, తద్వారా పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుకోవడం అనేది జీవితకాల పోరాటం. ఆపకుండా కొనసాగించాల్సిందే. శరీరంలో ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల మగవాళ్లలో మాత్రమే ఉండే హార్మోన్లు శరీరంలో అధికమై మీకు ఇలా గడ్డాలు, మీసాలు పెరుగుతున్నాయి. పీసీఓఎస్ అదుపులో రాగానే .. అప్పటికే వచ్చిన వెంట్రుకలు మాయమై పోవు. కొత్త వెంట్రుకలు రాకుండా ఉంటాయంతే. ఇబ్బందిగా అనిపిస్తే లేజర్ ట్రీట్మెంట్తో తగ్గించుకోవచ్చు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నదే. అలాగే, సమయం కూడా పడుతుంది. ఇక, పీసీఓఎస్‌తో ఇదొక్కటే సమస్య కాదు. సమర్థంగా నియంత్రించ లేకపోతే బీపీ, షుగర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, మెటబాలిక్ సిండ్రోమ్‌లాంటి వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉంది. నిపుణులను సంప్రదిస్తే.. యాంటీ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ఇస్తారు. ఇవి మీ శరీరంలోని మగ హార్మోన్లను నియంత్రణలో ఉంచుతాయి.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

