Health Tips | పొట్టపై స్ట్రెచ్ మార్క్స్తో ఇబ్బంది పడుతున్నారా.. ఆ గుర్తులు తుడిచేయండిలా !
స్ట్రెచ్ మార్క్స్.. చర్మాన్ని చీల్చుకుంటూ వచ్చినట్టుగా కనిపించే చారలు. వీటి కారణంగా మహిళలు కొన్ని రకాల వస్ర్తాలకు దూరంగా ఉంటారు. బయటికి కనిపించకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. స్ట్రెచ్ మార్క్స్.. చాలా సందర్భాల్లో ప్రసవం తర్వాత వస్తాయి. ఊబకాయం, వ్యాయామం వల్ల కూడా రావచ్చు.
Health Tips | స్ట్రెచ్ మార్క్స్.. చర్మాన్ని చీల్చుకుంటూ వచ్చినట్టుగా కనిపించే చారలు. వీటి కారణంగా మహిళలు కొన్ని రకాల వస్ర్తాలకు దూరంగా ఉంటారు. బయటికి కనిపించకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. స్ట్రెచ్ మార్క్స్.. చాలా సందర్భాల్లో ప్రసవం తర్వాత వస్తాయి. ఊబకాయం, వ్యాయామం వల్ల కూడా రావచ్చు.
ఒకసారి వస్తే జీవితాంతం ఉండిపోతాయని చాలామంది నమ్మకం. కానీ వాటిని వదిలించుకోడానికి ఒక ఉపాయం ఉంది. అయిదు టేబుల్ స్పూన్ల కాఫీపొడి, మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, ఓ టేబుల్ స్పూన్ అలొవెరా జెల్, ఇవన్నీ కాస్త కరిగేందుకు చుక్క నీరు.. ఈ మిశ్రమంతో సున్నితంగా మసాజ్ చేసుకుంటే.. స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..
కాఫీలోని యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి మేలు చేస్తాయి. చర్మంమీది మృత కణాలను తొలగించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలో తగినంత తేమను సమకూర్చి… మృదువుగా మారుస్తాయి.

కొబ్బరినూనెకు హానికర సూక్ష్మక్రిములను సంహరించే శక్తి ఉంది. అందులోని ఇ, కె విటమిన్లు చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరినూనెలోని అమైనో యాసిడ్స్ చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అలొవెరాలో ఉండే వాపును తగ్గించే లక్షణం ఎలాంటి చర్మ సమస్యకైనా ఉపయోగపడుతుంది. ఇందులోని కొలాజెన్ వల్ల చర్మానికి సాగే గుణం పెరుగుతుంది.
వారానికి రెండు మూడుసార్లు ఈ మిశ్రమాన్ని అవసరం ఉన్నచోట రాయాలి. ఓ అయిదు నిమిషాల పాటు స్ట్రెచ్ మార్కుల మీద వలయాకారంగా మర్దన చేయాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

