ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటయ్య పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ సమీపంలోని కంకర మిల్లు వద్ద పనిచేస్తున్న కొందరు వ్యక్తులు పులి సంచరిస్తున్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు. అటువైపుగా ప్రయాణం చేస్తున్న రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ సాదిక్ అలీ..
ఖమ్మం రూరల్, అక్టోబర్ 10 : ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటయ్య పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ సమీపంలోని కంకర మిల్లు వద్ద పనిచేస్తున్న కొందరు వ్యక్తులు పులి సంచరిస్తున్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు. అటువైపుగా ప్రయాణం చేస్తున్న రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ సాదిక్ అలీ కారును ఆపిన వ్యక్తులు పులి సంచారంపై అతడికి తెలిపి ఆందోళనకు గురయ్యారు. తాము పని చేస్తున్న కొద్ది ప్రదేశానికి దూరంలో చాడి చప్పుడు లేకుండా పులి అటువైపుగా వెళ్లడం చూశామని, కాల్వ దాటి కంకర మిల్లు సమీపంలోని గుట్టలోకి ప్రవేశించిందని వారు పేర్కొన్నారు. అయితే చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సాదిక్ సూచించారు. ఒంటరిగా ప్రయాణం చేయవద్దని గుంపులు గుంపులుగా ప్రయాణం సాగించాలని కార్మికులకు తెలిపారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తే అసలు అక్కడ పులి సంచరించిందా, మరి ఇతర జీవా అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

