చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన పలు రికార్డులు తనిఖీ చేశారు.
- పోలీస్ కమిషనర్ సునీల్ దత్
బోనకల్లు, జూలై 18 : చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన పలు రికార్డులు తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరును పరిశీలించారు. నేరప్రవర్తన కలిగిన హిస్టరీ షీట్, రౌడీషీటర్ల రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధిత ఫిర్యాదుదారులతో మాట్లాడారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం, నియంత్రణపై నిఘా పెంచాలని, సరిహద్దు రాష్ర్టాల నుంచి అక్రమ రవాణాను నియంత్రించేందుకు రాత్రి గస్తీ, పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేసుల నమోదు విషయంలో తాత్సారం చేయొద్దన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యపరచాలని, దీనిపై సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

