తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామ సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి...
ఎర్రుపాలెం, అక్టోబర్ 28 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామ సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆ శాఖ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన వీఓ భవనం, షెడ్డు, గోడౌన్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి, పనుల నిర్వహణలో సమర్థత కనబరిచినందుకు ఈ ప్రశంసలు దక్కాయి. రాష్ట్రంలోని ఇతర గ్రామ పంచాయతీలు కూడా ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, బిల్లుల చెల్లింపుల ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేశామని, పని పూర్తయిన 15 రోజుల్లోనే బిల్లుల మొత్తం గ్రామ పంచాయతీ ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Shiva Nirvana | బాలకృష్ణతో శివ నిర్వాణ సినిమా .. మైసూర్లో కథ వినిపించిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

