ఆళ్లపల్లి, ఆగస్టు 15: శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని మర్కోడు గ్రామంలో ముత్యాలమ్మకు మహిళలు బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో డప్పు మేళాలతో ప్రదర్శనగా బయలుదేరి గ్రామ శివారులోని ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించారు.
బూర్గంపహాడ్, ఆగస్టు 15: మండలంలోని టేకులచెరువు లో బోనాల పండుగను ఆదివారం మహిళలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా మేళతాళాల మధ్య గ్రామదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పర్ణశాల, ఆగస్టు 15: మండలంలోని కే లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ముత్యాలమ్మకు మహిళలు బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని గ్రామదేవతల వద్దకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.