ఐఅండ్పీఆర్కు పెద్ద దిక్కెవరు ?
భద్రాద్రి జిల్లాలో సమాచార, పౌర సంబంధాల (ఐఅండ్‌పీఆర్) శాఖ పాలనా విభాగం అరకొరగా, అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సమాచారం అందే మీడియాకు, పత్రికలకు.. ప్రభుత్వ పాలన విభాగంలో అధికారిక సమాచారం అందడం మాత్రం అత్యంత కష్టతరమవుతోంది.
- పత్రికలకు సకాలంలో అందని అధికారిక సమాచారం
- ఆ కార్యాలయానికి వెళ్తే కనిపించేవారు కరువు
- ఇంఛార్జి డీపీఆర్వోలతో అరకొర పాలన
- ఐడీవోసీకే పరిమితమైన జిల్లా సమాచార వ్యవస్థ
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో సమాచార, పౌర సంబంధాల (ఐఅండ్‌పీఆర్) శాఖ పాలనా విభాగం అరకొరగా, అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సమాచారం అందే మీడియాకు, పత్రికలకు.. ప్రభుత్వ పాలన విభాగంలో అధికారిక సమాచారం అందడం మాత్రం అత్యంత కష్టతరమవుతోంది. అసలు ఈ జిల్లాలో ఈ శాఖకు పెద్ద దిక్కు కరువైనట్లుగా ఉంది. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత వచ్చిన డీపీఆర్వో తప్ప.. ఆ తర్వాత రెగ్యులర్ డీపీఆర్వో నియామకమే జరగలేదు. కేవలం ఇంఛార్జితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో అధికారిక సమాచారం సరైన సమయంలో పత్రికలకు అందడం లేదు. దీంతో ఆ పత్రికలు కూడా అధికారిక సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఆద్యంతం ఆటంకం కలుగుతోంది. అధికారిక సమాచారాన్ని పత్రికలకు చేరవేసేందుకు వాట్సప్‌లో పేరుకు మాత్రమే డీపీఆర్వో గ్రూప్ పెట్టినట్లుగా ఉంది. కలెక్టరేట్లో అధికారిక సమీక్షలు, సమావేశాలు జరిగితే వాటి సమాచారాన్ని పత్రికలకు విడుదల చేసేందుకు ఈ సమాచార, పౌర సంబంధాల శాఖ గంటల కొద్దీ సమయం తీసుకుంటోంది. చివరికి ప్రెస్నోట్లు పంపడంలో కూడా తీవ్రమైన కాలయాపన జరుగుతోంది. ఫలితంగా స్థానిక మీడియా ప్రతినిధులు ఈ సమాచారాన్ని క్రోడీకరించుకొని ప్రచురణ కేంద్రాలకు పంపేందుకు మరింత ఆలస్యం కావడానికి కారణమవుతోంది. మొత్తంగా సమాచారం పంపే విధుల్లో ఈ శాఖ విఫలమవుతోంది.
సకాలంలో పత్రికలకు అందని సమాచారం..
గతంలో కొత్తగూడెంలో ఉండే కలెక్టరేట్లో సమాచారం ఆలస్యమైనా మీడియా ప్రతినిధులు ఐఅండ్‌పీఆర్ ఆఫీసుకు వెళ్లి సమాచారం తెచ్చుకునే వారు. ఇప్పుడు ఈ కార్యాలయం పాల్వంచ ఐడీవోసీలోకి మారింది. ఒకవేళ సమాచారం కోసం సమయం వెచ్చించి అక్కడికి వెళ్లినా ఆ కార్యాలయంలో ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. అధికారిక సమావేశాల పేరుతో కాన్ఫరెన్స్ హాల్లో ఉంటుండడంతో ప్రెస్నోట్లు, ఇతర సమాచారాలు పత్రికలకు ఆలస్యమవుతున్నాయి. కొత్తగా వచ్చిన ఏపీఆర్వోకు డీపీఆర్వో బాధ్యతలు అప్పగించినా కార్యాలయ పాలన తూతూమంత్రంగానే కొనసాగుతోంది. అసలు భద్రాద్రిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసినప్పుడు రెగ్యులర్ డీపీఆర్వోగా శ్రీనివాస్‌ను నియమించారు. 2020లో డిప్యూటేషన్‌పై ఆయన హైదరాబాద్ వెళ్లారు. అప్పుడు భద్రాచలం ఏపీఆర్వోగా ఉన్న శ్రీనివాసరావుకు ఇంఛార్జి డీపీఆర్వోగా బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా ఇటీవల భూపాలపల్లికి బదిలీ అయ్యారు. దీంతో కొత్తగూడెం ఏపీఆర్వోగా ఉన్న హజ్గర్కు ఇంఛార్జి డీపీఆర్వోగా బాధ్యతలు అప్పటించారు. ఇలా నాలుగేళ్లుగా ఇంఛార్జులతో మాత్రమే ఈ శాఖ పాలన కొనసాగుతోంది.
ఐడీవోసీకే పరిమితం..
ఈ ఐఅండ్‌పీఆర్ విధులు కేవలం ఐడీవోసీకి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఆలస్యంగానైనా అక్కడి సమాచారం మాత్రమే పత్రికలకు అందిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ల స్థాయిలోగానీ, చివరికి జడ్పీలోగానీ జరిగే అధికారిక సమావేశాలకు ఆ శాఖ నుంచి ఎవరూ రావడంలేదు. ఆ సమాచారాన్ని పత్రికలకు పంపడమూ లేదు.
నాకు ఎఫ్ఏసీ ఇవ్వలేదు..
ఇక్కడి రెగ్యులర్ డీపీఆర్వో డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో ఉన్నారు. గత ఇంఛార్జి డీపీఆర్వో బదిలీపై వెళ్లారు. నాకు కూడా ఇంఛార్జి బాధ్యతలే ఇచ్చారు. ఎఫ్ఏసీ ఏమీ ఇవ్వలేదు. కార్యాలయంలో ఎలాంటి సమాచారమున్నా దానిని వెంటనే పత్రికలకు ఇస్తున్నాం. మా శాఖలో సిబ్బంది లేరనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం.
-హజ్గర్, ఇంఛార్జి డీపీఆర్వో, భద్రాద్రి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

