రెండు డోసుల టీకా వేసుకోవాలి

- డిసెంబర్ నాటికి నూరు శాతం టీకా ప్రక్రియ పూర్తి కావాలి
- కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్సులో సీఎస్ సోమేశ్‌కుమార్
మామిళ్లగూడెం, అక్టోబర్ 26: ప్రతి ఒక్కరూ రెండు డోసుల కొవిడ్ టీకాను తప్పనిసరిగా వేసుకోవాలని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచించారు. జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్లకు సూచించారు. కొవిడ్ టీకాల స్పెషల్ డ్రైవ్ పురోగతిపై మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకా వేసేందుకు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, వీఆర్ఏలు, ఆశా వర్కర్లతో మల్టీ టీంలను ఏర్పాటు చేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో టీకా ప్రక్రియను వేగవంతంగా చేసి పర్యవేక్షణ పెంచాలన్నారు. డిసెంబర్ చివరి నాటికి 100 శాతం టీకా ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు 10.60 లక్షల మంది ఉన్నారని, వారిలో 8,20,593 మందికి మొదటి డోస్ వేశామని, 2,73,642 మందికి రెండో డోస్ వేశామని వివరించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఎంహెచ్‌వో మాలతి, జడ్పీ సీఈవో అప్పారావు, వైద్యులు అలివేలు, రాజేశ్, కోటిరత్నం, సైదులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మండలాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా వేయాలని సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

