‘దళిత బంధు’పై విమర్శలు తగదు

- రాష్ట్రంలో 75 లక్షల మంది పథకం వర్తింపు
- బీజీపీ నాయకులవి పసలేని వాదనలు
- రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసరావు
కొత్తగూడెం, సెప్టెంబర్ 24: దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పథకంపై విమర్శలు సరికావని హితవు పలికారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులకు చేతనైతే కేంద్రం నుంచి ఒక్కో దళిత కుటుంబానికి రూ.50 లక్షల పథకం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 75 లక్షల మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ప్రభుత్వం ఏడు వేల దళిత కుటుంబాలకు 16,800 ఎకరాల భూమిని పంచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేల ఎకరాలకు సాగునీరు ఇస్తుంటే చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం అవాకులు చెవాకులు పేలుతోందన్నారు. దమ్ముంటే బీజేపీ కాళేశ్వర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం 2 వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు. సమావేశంలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆంతోటి నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మోరె భాస్కర్‌రావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పాల్వంచలో ఘన స్వాగతం..
పాల్వంచ, సెప్టెంబర్ 24: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ శుక్రవారం పాల్వంచకు విచ్చేశారు. అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూల వేశారు. ఆయనకు విద్యార్థి సంఘాల నాయకులు చీకటి కార్తీక్, కట్టుపల్లి అంబేడ్కర్, ఎం.సందీప్, గడ్డం నర్సింహారావు, మోరె భాస్కర్, పసుపులేటి నాగరాజు, రేగులగడ్డ అర్జున్ ఘన స్వాగతం పలికారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

