కలెక్టరేట్ నిర్మాణ పనులను..వేగవంతం చేయాలి

- ఖాళీ ప్రదేశంలో మొక్కలతో మంచి ప్లాంటేషన్ వేయాలి
- పనులపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలి
- సమీకృత కలెక్టరేట్ తనిఖీలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్
కొత్తగూడెం/ కొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 26: సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కేపీసీ కంపెనీ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పని విభజనతో జాప్యానికి తావుండదని సూచించారు. కలెక్టరేట్ సముదాయంలోని ఖాళీ ప్రదేశాన్ని అందమైన మొక్కలతో ప్లాంటేషన్ చేయాలని, నిర్మాణ పనుల్లో కాలయాపన చేస్తే సహించమని పేర్కొన్నారు. నిధుల సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఆర్అండ్బీ ప్రాజెక్టు డీజీఎంకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ బీమ్లా, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేశ్, ఇంట్రా ఈఈ నళిని, ఆర్అండ్బీ డీఈ నాగేశ్వరరావు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ స్వామి, కేపీసీ కంపెనీ ప్రాజెక్టు డీజీఎం నరసింహారావు పాల్గొన్నారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై సమీక్ష
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 2022 ఫిబ్రవరిలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై అధికారులు సమీక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియం, ప్రగతి మైదానాన్ని వారు పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌తో ఆర్మీ కల్నల్ మనోజ్, అజయ్‌కుమార్‌యాదవ్, జిల్లా యువజన క్రీడల అధికారి టి.సీతారాం, ఆఫీస్ సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్ సమీక్షించారు. రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనే యువకులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వారికి సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

