తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘననివాళులర్పించారు. అధికారికంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పలు చోట్ల చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించి, పూలమాలలు వేశారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.