Rekonda | మోడల్ గ్రామం రేకొండలో సోలార్ ప్యానల్ ఏర్పాటు
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా ఎంపిక చేయడంలో భాగంగా సోమవారం విద్యుత్ సిబ్బంది సోలార్ ప్యానల్ ను పెద్దమ్మ పల్లెలో ఏర్పాటు చేశారు.
Rekonda | చిగురుమామిడి, ఫిబ్రవరి 2 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా ఎంపిక చేయడంలో భాగంగా సోమవారం విద్యుత్ సిబ్బంది సోలార్ ప్యానల్ ను పెద్దమ్మ పల్లెలో ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇప్పటికే ఇంటింటా సర్వే చేపట్టున్నామని, 1200 వరకు గ్రామంలో సోలార్ ప్యానెల్ లు అవసరం ఉంటాయని మొదటి విడతగా 24 ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ అల్లెపు సంపత్, కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు.
త్వరలోనే అన్ని ప్రాంతాల్లో సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేసి మోడల్ సోలార్ గ్రామంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడ వార్డు సభ్యులు కారంపూరి తార, చెంచల నాగరాజు, జిలకల అజయ్, కాసాని సతీష్, గ్రామస్తులు గాజపాక సునీల్, కారంపూరి వెంకటేశం, పిట్టల వెంకటరాజం, మాడమల్లారెడ్డి, బండోజు సదానంద చారి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

