Veenavanka | వీణవంక : మహాశివరాత్రి సందర్భంగా వీణవంక శివాలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరిచాయి. ఈ సందర్భంగా వీణవంకకు చెందిన గద్వాల జిల్లా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీణవంకకు చెందిన వోరేం విజయ్ కుమార్ కుమార్తెలు వోరేం సిరిసాన్విత-సాయి సుదీక్ష ల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీణవంక ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుండి మాతృభూమి మీద మమకారం తో విచ్చేసిన వీణవంకకు వచ్చి అద్భుతమైన నృత్యాభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
సంప్రదాయ వస్త్రధారణలో, లయబద్ధమైన అడుగులతో, భావప్రకటనతో శివతాండవాన్ని ఆవిష్కరించి సభికుల ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు మరియు గ్రామ పెద్దలు చిన్నారులను అభినందించారు. వీరు చిన్న వయసులోనే కళా బాల, శివ నంది, నటరాజ్ పురస్కారాలు అందుకుని ప్రతిభ చాటారు. నాట్య మువ్వ, నంది, తెలంగాణ బెస్ట్ డాన్సర్ అవార్డులతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తమ పేరు నమోదు చేయించుకోవడం గర్వకారణం.