Godavarikhani | ఆపరేషన్ అడ్డగుంట.. అభివృద్ధి పేరుతో భవనాల కూల్చివేత
రామగుండం నగర పాలక సంస్థ ఆపరేషన్ అడ్డగుంటకు నడుం బిగించింది. గత సెప్టెంబర్ 9న ఆపరేషన్ పోచమ్మ మైదాన్ సమాప్తం కావడంతో నెల రోజుల విరామం తర్వాత అడ్డగుంటపల్లిలో జంక్షన్, రోడ్లు అభివృద్ధి పేరుతో కూల్చివేతలు మొదలు పెట్టింది.
- 57వ డివిజన్ లో వరుస ఘటనలతో ఆందోళన
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 26 : రామగుండం నగర పాలక సంస్థ ఆపరేషన్ అడ్డగుంటకు నడుం బిగించింది. గత సెప్టెంబర్ 9న ఆపరేషన్ పోచమ్మ మైదాన్ సమాప్తం కావడంతో నెల రోజుల విరామం తర్వాత అడ్డగుంటపల్లిలో జంక్షన్, రోడ్లు అభివృద్ధి పేరుతో కూల్చివేతలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా సోమవారం నగర పాలక సంస్థ 57వ డివిజన్ పరిధిలోని అడ్డగుంటపల్లిలో గల అబ్దుల్ కలాం విగ్రహం జంక్షన్ వద్ద రోడ్డు పక్కన గల భవనాన్ని నగర పాలక పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రెండు ఎక్స్కవేటర్లతో కూల్చివేత చర్యలకు ఉపక్రమించారు. రోడ్డు వెడల్పులో భాగంగా సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన భవన యజమానులకు నోటీసులు జారీ చేసినా స్పందించని కారణంగా తొలగిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
కాగా, వారం రోజుల క్రితం ఇదే 57వ డివిజన్ పరిధి ఎన్టీఆర్ నగర్ లో రోడ్డుకు 30 ఫీట్లు సెట్ బ్యాక్ ఉండాలని ఉద్రిక్తత పరిస్థితుల నడుమ నంబర్ లేని జేసీబీలతో ఓ భవనం కూల్చివేత సంఘటన జరిగిన నేపథ్యంలో తాజాగా ఇదే డివిజన్ లో మరో భవనం కూల్చివేత జరిగింది. వరుస సంఘటనల నేపథ్యంలో కూల్చివేతలు ఇక్కడికే పరిమితమా? కొనసాగింపు ఉంటుందా.? అని డివిజన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడ్డగుంటపల్లి జంక్షన్ అభివృద్ధి పేరుతో భవనాలకు నోటీసులు జారీ చేసి అదను చూసి కూల్చివేత చర్యలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన విషయమై నగర పాలక అధికారులను సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
Ram Pothineni | మెన్స్ డే స్పెషల్.. ‘RAPO23’ ప్రీ-లుక్ వైరల్!
‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

