ఘనంగా యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో పల్లెలు మొదలు నగరం వరకు యోగాపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు.
- వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు
- ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేసిన ఔత్సాహికులు
కార్పొరేషన్/ కొత్తపల్లి/ కలెక్టరేట్/ తెలంగాణచౌక్/ రాంనగర్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో పల్లెలు మొదలు నగరం వరకు యోగాపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఆయా చోట్ల కార్యక్రమాలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేయాలని సూచించారు. స్థానిక జ్యోతిబాఫూలే మైదానంలో జరిగిన వేడుకల్లో మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని మాట్లాడుతూ, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే ప్రతిరోజూ యోగా సాధాన చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వాల రమణారావు, తదితరులు పాల్గొన్నారు. నగరంలోని డా. బీఆర్ అంబేదర్ స్టేడియంలో పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్, ఆయుష్ డిపార్ట్ మెంట్, నెహ్రూ యువకేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమాన్ని కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజ జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని, యోగాతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు.
కార్యక్రమంలో ఏసీపీ నరేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఎం వెంకట్రాంబాబు, ముత్యాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని జడ్పీ క్వార్టర్స్‌లో గల సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో డివిజనల్ రెవెన్యూ అధికారి కుందారపు మహేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, యోగాతో అనునిత్యం ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంగా, ఉల్లాసంగా తమ పనులు చేసుకోవచ్చన్నారు. డేకేర్ సెంటర్ నిర్వహణ కమిటీ బాధ్యుడు సముద్రాల జనార్దన్‌రావు మాట్లాడుతూ, యోగాతో మానసిక ఒత్తిడిని నివారించి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్డీవో మహేశ్వర్, యోగా శిక్షకుడు రాజేందర్‌ను డేకేర్ సెంటర్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డేకేర్ సెంటర్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల కేశవరెడ్డి, ఉపాధ్యక్షుడు ఉప్పల రామేశం, జడ్జి టీ ఈశ్వర్, ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఏరియా కో ఆర్డినేటర్లు అన్నమనేని సుధాకర్‌రావు, బుర్ర జగదీశ్వర్‌గౌడ్, కొండూరి సత్యనారాయణ, నర్సింహారెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ చింతలపల్లి రాజారెడ్డి, సింగమరాజు, చింతల సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి, బ్రహ్మానందం, సురేంద్రాచార్యులు, లక్ష్మయ్య, భూంపల్లి మోహన్‌రెడ్డి, మందాడి దేవేందర్‌రెడ్డి, వీ మల్లయ్యతో పాటు వందమంది వయోవృద్ధులు పాల్గొన్నారు.
ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా యువజన క్రీడా శాఖ, జిల్లా యోగా అసోసియేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన యోగా దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ఒకరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. యోగాను స్పోర్ట్స్ కోటాలో చేర్చడం దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని జిల్లా యోగా అసోసియేషన్ కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు.
కొత్తపల్లిలోని అల్ఫోర్స్ హైస్కూల్లో ఎన్సీసీ సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ. ప్రతి వ్యక్తి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించా లంటే ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఎన్సీసీ కెడెట్స్ పూజశ్రీ, సూర్యప్రకాశ్, శిక్షకుడు లక్ష్మణ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సెయింట్ జార్జ్ సీబీఎస్ఈ ఇంటర్నేషనల్ పాఠశాలలో యోగా డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యా సంస్థల చైర్మన్ డా. పీ ఫాతిమారెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణతో పాటు, జ్ఞానాన్ని పెంచుకోవడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ భార్గవ్, నిరంజన్, శిక్షకుడు ప్రవీణ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యానగర్‌లోని సువిద్య పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ మట్టతిల్ బాబు, ప్రిన్సిపాల్ మధుకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమాన్‌నగర్‌లోని బ్లూబెల్స్ పాఠశాలలో యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జంగ సునీతామ నోహర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భగవతీ పాఠశాలలో యోగాడే, మ్యూజిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ బీ రమణారావు, కరస్పాండెంట్ బీ విజయలక్ష్మి సహకారంతో విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మోనికారాయ్, అధ్యాపకులు పాల్గొన్నారు.
మానేరు పాఠశాలలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం చేయించారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచానికి భగవద్గీతను అందించిన భారతదేశం, నేడు యోగాను విశ్వవ్యాప్తం చేసిందన్నారు. కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
పద్మనగర్, మంకమ్మతోటలోని పారమిత పాఠశాలల్లో యోగా డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాఠశాలల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు మాట్లాడుతూ, వయస్సు పెరిగినా తాను ఆరోగ్యంగా ఉండడానికి యోగానే ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో యోగా శిక్షకుడు ఉదయ్ కిరణ్‌రెడ్డి, డైరెక్టర్స్, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
నగరంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) జిల్లా సహసంఘచాలక్ యెలగందుల సత్యం జీ మాట్లాడుతూ, ప్రాణాయామం, ఆసనాలు, సూక్ష్మవ్యాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, దృఢత్వం కల్గుతుందన్నారు. కార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ భానుజీ, మాధవసేవా సమితి సంయుక్త కార్యదర్శి కామారపు ప్రసాద్‌తో పాటు పలువురు సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.
కమిషనరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డేలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలతో పాటు రిజర్వు ఇన్స్పెక్టర్లు రజినీకాంత్, కుమారస్వామి, శ్రీధర్ రెడ్డి, సురేశ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు గంగిశెట్టి అరుణ్ కుమార్, రాజు, సరస్వతి, జిల్లా బాడీ బిల్డింగ్ సెక్రటరీ శ్రీపతి దామోదర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తిమ్మాపూర్/ రూరల్/ మానకొండూర్/ వీణవంక/ చిగురుమామిడి/చొప్పదండి, జూన్ 21: తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీలో గల మానసిక వికలాంగుల పాఠశాలలో ఏవో బాలరాజు, ప్రిన్సిపాల్ సతీశ్ ఆధ్వర్యంలో, అలాగే వాగేశ్వరి ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వలంటీర్ రామ్మోహన్‌రెడ్డి విద్యార్థులతో ఆసనాలు వేయించారు. వీరితో పాటు పలు కళాశాలల్లో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు యోగా చేయించారు. అలాగే మన్నెంపల్లిలో గ్రామస్తులు, ఉపాధి హామీ సిబ్బంది ఆసనాలు వేశారు. శంకరపట్నం మండలం మొలంగూర్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం నీరజ, ఇతర పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆసనాలు వేయించారు.
తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలలో యోగా దినోత్సవాన్ని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు ప్రారంభించి మాట్లాడుతూ, రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చన్నారు. యోగా ట్రైనర్ రమేశ్, మెడిటేషన్ ట్రైనర్ సుధాకర్ విద్యార్థులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రావు, అకాడమిక్ డీన్ డాక్టర్ పీకే వైశాలి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రణీత, టీ ప్రవీణ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండల కేంద్రలో బీజేపీ ఆధ్వర్యంలో యోగా గురువుతో కలిసి నాయకులు యోగాసనాలు అభ్యసించారు. కార్యక్రమంలో కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, బీజేపీ మండలాధ్యక్షుడు రాపాక ప్రవీణ్, నాయకులు పాల్గొన్నారు. వీణవంకలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థినులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో ఆయుర్వేద డా.రవికుమార్, డా.షబానా, సంపత్, కేజీబీవీ ప్రత్యేకాధికారి లావణ్య, పీఈటీ మౌనిక, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
చిగురుమామిడి ఉన్నత పాఠశాల ఆవరణలో, మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ వద్ద కొండాపూర్ మాజీ ఉపసర్పంచ్ పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో యోగాసనాలు వేయించి, యోగా ప్రాముఖ్యతను వివరించారు. గాగిరెడ్డి పల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగాసనాలు వేశారు. ప్రధానోపాధ్యాయుడు రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ అచ్చ రవీందర్, డెయిరీ చైర్మన్ పన్యాల శ్రీధర్ రెడ్డి, మాజీ చైర్మన్ కంది శంకర్, ముంజ చంద్రయ్య, పెనుకుల సంపత్, గొల్లపల్లి సదాచారి, చంద్రశేఖర్, మకుటం సంపత్, వెంకన్న, కుమార్, సంపత్, అజయ్, ప్రణయ్ పాల్గొన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ ఆదర్శ మోడల్ పాఠశాలలో విద్యార్థులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కోల రమేశ్ యోగా ప్రాముఖ్యతను వివరించగా, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
రామడుగు మండలం వన్నారం ఎంయూపీఎస్ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ యోగ , ప్రపంచ సంగీత దినోత్సవంలో రిటైర్డ్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠశాలలో ఆటపాటలతో పాటు చకని విద్యాబోధన అందిస్తూ పాఠశాలలో ప్రతి వారం యోగా తరగతులు నిర్వహించడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జకుల లక్ష్మీనారాయణను అభినందించారు. అనంతరం ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో పనిచేస్తున్న సంగీత దర్శకుడు కేబీ శర్మను సతరించారు. కార్యక్రమంలో బూరుగుల రవీందర్, ఉమాపతి, మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

