Lagalamarri | ల్యాగలమర్రిలో ప్రభుత్వ ఆట స్థలంలో అక్రమ ఇంటి నిర్మాణం.. అధికారులపై చర్య తీసుకోవాలని ఆందోళన
పెగడపల్లి మండలం ల్యాగలమర్రిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న వారికి సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ దళితులు డిమాండ్ చేశారు.
- పెగడపల్లి అంబేడ్కర్ చౌరస్తా వద్ద గ్రామ దళితుల నిరసన
Lagalamarri | పెగడపల్లి : పెగడపల్లి మండలం ల్యాగలమర్రిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న వారికి సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ దళితులు డిమాండ్ చేశారు. ల్యాగలమర్రి గ్రామ ఎస్సీ కాలనీ ఆట స్థలంకు కేటాయించిన సర్వే నంబర్ 6 లోని ప్రభుత్వ భూమిలో ఇదే గ్రామానికి చెందిన ఒకరు అక్రమంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్నాని గ్రామ దళితులు ఆరోపించారు. తాము వ్యతిరేకుస్తున్నా, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, పంచాయతీ కాఆర్యదర్శి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నారని గ్రామ దళితులు ఆరోపిస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ దళితులు మాట్లాడుతూ అక్రమ ఇంటి నిర్మాణంపై గత రెండేళ్లుగా ఆందోళన చేస్తూ, మంత్రి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, డీపీవో ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని ప్రధాన రోడ్డుపై దళితులు బైఠాయించారు. సర్వే నంబర్ 6కు బదులుగా, సర్వే నంబర్- 240 వేసి అక్రమంగా ఇంటి నిర్మాణం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై కుమారస్వామి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జమున అక్కడికి చేరుకుని, ఆర్డీవో, ఇతర అధికారులతో మాట్లాడి సమస్యను పర్కిరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామ దళితులు శాంతించి ఆందోళన విరమించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

