Godavarikhani | రామగుండంలో ఇంకుడు గుంతల నిర్మాణాలపై మల్లగుల్లాలు.. రూ.60 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణాలపై జాప్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరు గారుతోంది. పెద్దపల్లి జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో టెండర్ ప్రక్రియ జరిగినా, రామగుండం కార్పొరేషన్ లో మాత్రం ఇంకా టెండర్ల ప్రక్రియ వద్దనే అధికారులు మల్లగుల్లాలు పడటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- గడువు ముగిసినా తెరచుకోని బిడ్లు
- బల్దియాలో జాప్యంపై అనుమానాలు
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 20 : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణాలపై జాప్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరు గారుతోంది. పెద్దపల్లి జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో టెండర్ ప్రక్రియ జరిగినా, రామగుండం కార్పొరేషన్ లో మాత్రం ఇంకా టెండర్ల ప్రక్రియ వద్దనే అధికారులు మల్లగుల్లాలు పడటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ జల మట్టం పెంపుదల లక్ష్యంగా ‘వర్షపు నీటి సేకరణ’ (ఆర్.డబ్ల్యు.హెచ్ ప్రక్రియలో భాగంగా నగర పాలక పరిధిలోని వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల వద్ద సుమారు 1500 ఇంకుడు గుంతలను నిర్మించాలని సంకల్పించింది. ఈ ప్రక్రియతో వర్షపు నీటిని జలాశయానికి మళ్లిస్తారు. తద్వారా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను పునరుద్ధరిస్తుంది. రాబోయే వేసవి కాలం ముందే ఈ పనులు పూర్తి కావల్సిన లక్ష్యం ఉంది. దీనిలో భాగంగా సుమారు రూ.60లక్షల అంచనా వ్యయంతో నగర పాలక అధికారులు ఇటీవల టెండర్లను పిలిచారు.
బిడ్ల సమర్పణ 11న ముగిసింది. ఐతే టెండర్లు దాఖలై వారం గడిచినా బిడ్లను తెరవకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇదే టెండర్ విషయంలో నగర పాలక కార్యాలయంలోనే ఇరువురు కాంట్రాక్టర్ల మధ్య గలాటా జరిగిన సంఘటన విధితమే. ఆర్.డబ్ల్యు.హెచ్ పనులకు సంబంధించి గతంలో కొన్ని పనులు చేశాననీ, వాటికి సంబంధించి జేసీబీ బిల్లులు సైతం పొందినట్లు ఓ కాంట్రాక్టర్ బాహాటంగానే పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గడువు ముగిసినా పనులు టెండర్ల వద్దనే నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఇతర పనులకు పిలిచిన టెండర్ల బిడ్స్ తెరిచి ఈ ఒక్కటీ జాప్యం చేయడంపై ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే జాప్యంకు గల కారణాలను అధికారులు బహిర్గతం చేయాల్సి ఉంది. అధికారుల నిర్లిప్తత కారణంగా ప్రభుత్వ ఆశయం నీరుగారుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల్లో ఒత్తిళ్లకు తావు లేకుండా పారదర్శకమైన టెండర్ విధానం అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని టెండర్ల విషయంలో వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాల్సి ఉంది. గతంలో జరిగిన ఆర్. డబ్ల్యు.హెచ్ పనులు, బిల్లులను పరిశీలించాల్సి ఉంది. ఇంకుడు గుంతల నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.
వారం వ్యవధిలో ప్రక్రియను పూర్తి చేస్తాం : జే అరుణ శ్రీ, కమిషనర్, రామగుండం కార్పొరేషన్
కార్పొరేషన్ పరిధిలో ఆర్డబ్ల్యూహెచ్ పనుల విషయంలో అనివార్య కారణాల వల్ల జాప్యం జరుగుతుంది. త్వరలోనే దాఖలైన బిడ్లను సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలిస్తాం. మరో వారం వ్యవధిలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

