కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్
కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని 32వ వార్డు భీష్మనగర్కి చెందిన మత్స్య కార్మికుడు, బీఆర్ఎస్ కార్యకర్త కొండ్ర విద్యాసాగర్ గత వానకాలంలో చేపల వేటకు వెళ్లి వరదలో చికుకొని మరణించగా పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెకును మోతె రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన భార్య కొండ్ర జమున, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.
- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
- మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత
జగిత్యాల, మే 20 : కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని 32వ వార్డు భీష్మనగర్కి చెందిన మత్స్య కార్మికుడు, బీఆర్ఎస్ కార్యకర్త కొండ్ర విద్యాసాగర్ గత వానకాలంలో చేపల వేటకు వెళ్లి వరదలో చికుకొని మరణించగా పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెకును మోతె రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన భార్య కొండ్ర జమున, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 లక్షల పైచిలుకు మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, జగిత్యాల నియోజకవర్గంలో 50 వేల మందిపైగా సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. బలమైన కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ అని, ప్రమాద బీమా సభ్యత్వం ఉండడం వల్ల వారి కుటుంబానికి 2 లక్షలు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 25 మందికిపైగా ఇన్సూరెన్స్ చెకులు అందజేసినట్లు గుర్తు చేశారు.
ఒక చురుకైన కార్యకర్తని కోల్పోవడం బాధాకరమని, కొండ్ర జమున, వారి కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. మత్స్య కార్మికుల సంక్షేమం కోసం గతంలో కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, మిషన్ కాకతీయ, ఉచిత చేప పిల్లల పంపిణీ, లైవ్ జాకెట్లు, వ్యాన్లు, మోపెడ్లు ఇచ్చారని, చెరువులకు హద్దులు గుర్తించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోరె గంగమల్లు, సంఘం అధ్యక్షుడు శంకర్, మోతె మాజీ సర్పంచ్ జుంబర్తి శంకర్, మాజీ కార్యదర్శి నర్సయ్య, వార్డు యూత్ అధ్యక్షులు బింగి శేఖర్, నాయకులు లింగారెడ్డి, సిరికొండ మహేశ్, రాజేశ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

