Beautiful Governor: 58 మందితో అఫైర్.. ఆ బ్యూటీఫుల్ గవర్నర్‌కు 13 ఏళ్ల జైలుశిక్ష
Beautiful Governor: చైనా కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ హోదాలో ఉన్న ఓ మహిళకు 13 ఏళ్ల జైలుశిక్ష పడింది. 58 మంది సబార్డినేట్స్‌తో ఆమె అఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి లంచాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బ్యూటీఫుల్ గవర్నర్ అన్న నిక్‌నేమ్ కూడా ఉన్నది.
బీజింగ్: చైనాలో ఓ మహిళా ఆఫీసర్‌కు 13 ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రవర్తన సరిగా లేదని ఆమెకు సుమారు కోటిన్నర ఫైన్ కూడా వేశారు. చూడటానికి అందంగా కనిపించే జాంగ్ యాంగ్ అనే మహిళ.. గుజావ్ ప్రావిన్సులో సీపీసీ పార్టీ గవర్నర్‌గా, డిప్యూటీ సెక్రటరీగా చేసింది. ఆమెకు బ్యూటీఫుల్ గవర్నర్(Beautiful Governor) అన్న నిక్‌నేమ్ ఉన్నది. అయితే ఆమె తన చూపుల వలతో అనేక మందిని బుట్టలో వేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పదవిలో తనకన్నా చిన్నవారైన 58 మంది మగ ఆఫీసర్లతో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి వద్ద నుంచి ఆమె సుమారు 60 మిలియన్ల యువాన్లు లంచంగా తీసుకున్నట్లు కూడా అభియోగం నమోదు అయ్యింది.
22 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరిన జాంగ్‌కు ఇప్పుడు 52 ఏళ్లు. జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రస్తుతం డిప్యూటీ ర్యాంక్‌లో ఉన్నది. రైతులకు సాయం చేసేందుకు ఫ్రూట్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్‌ను ఆమె ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పెట్టుబడులు, అభివృద్ధి పేరుతో ఆమె మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోని కంపెనీలను ఆమె పట్టించుకునేది కాదు అని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
క్రమశిక్షణా, చట్టపరమైన ఉల్లంఘనలకు జాంగ్ పాల్పడినట్లు గుజావ్ ప్రావిన్షియల్ కమిటీ తన తీర్పులో పేర్కొన్నది. 58 మంది మగ సిబ్బందితో ఆమె అఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇచ్చిన ఆఫర్లను స్వీకరించిన వారు ఆమెకు లవర్లుగా ఉండిపోయారు. కొందరు ఆమెకు భయపడి .. ఆమెకు లొంగిపోయారు. ఓవర్‌టైం వర్క్, బిజినెస్ ట్రిప్ పేర్లతో ఆమె తన లవర్స్‌తో సమయం గడిపేదని తేలింది. ఏప్రిల్ 2023లో ఆమెను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో పదవి నుంచి తొలగించారు. సీపీసీ నుంచి ఆమెను వెలివేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

