దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్
సియోల్: కన్జర్వేటివ్ నేత యూన్ సుక్ యోల్ .. దక్షిణ కొరియా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అర్థరాత్రి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ న్యాయవాది అయిన యూఎన్ మార్చిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ప్రమాదకరంగా మారిన ఉత్తర కొరియాతో చర్చలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 15 సార్లు క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించిన విషయం తెలిసిందే. దీని పట్ల దక్షిణ కొరియా ఆందోళనలు వ్యక్తం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన యూన్ సుక్.. ఉత్తర కొరియాతో సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. 61 ఏళ్ల యూన్ తన స్క్రిప్ట్‌ను తానే రాసుకుంటున్నారు. ఫ్రీడమ్, మార్కెట్, ఫెయిర్‌నెస్ అంశాలపై ఆయన ప్రసంగించారు. 26 లక్షల డాలర్ల ఖర్చుతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. సుమారు 40 వేల మంది గెస్ట్‌లను ఆహ్వానించారు. చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషాన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాష హయషీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్ ఎమాఫ్లు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

