Yahya Sinwar: 24 ఏళ్లు జైల్లో ఉన్నాడు.. ఇప్పుడు హమాస్ లీడర్ ఆయనే.. ఆ వ్యక్తే ఇజ్రాయిల్ టార్గెట్
Yahya Sinwar: 24 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించిన వ్యక్తే.. ఇజ్రాయిల్‌పై అటాక్‌లో మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు. అతని కోసం ప్రస్తుతం ఇజ్రాయిల్ గాలిస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్‌లో అతనే టార్గెట్‌గా ముందుకు వెళ్తోంది. గాజాలో ఉన్న అతనితో పాటు అతని బృందాన్ని మట్టుబెట్టాలని ఇజ్రాయిల్ ప్లాన్ చేసింది.
న్యూఢిల్లీ: ఆకస్మిక దాడులతో ఇజ్రాయిల్‌ను హమాస్‌ను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అయితే పాలస్తీనాకు చెందిన ఆ ఉగ్రవాద సంస్థకు యహయా సిన్వార్(Yahya Sinwar) మూలస్తంభంగా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తే లక్ష్యంగా ఇజ్రాయిల్ తన గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇజ్రాయిల్‌పై అటాక్‌కు ప్లాన్ వేసిన మాస్టర్‌మైండ్ ఆయనే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిన్వార్‌తో పాటు ఆయన బృందాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయిల్ ముందకు వెళ్తోంది.
1962లో పుట్టిన సిన్వార్.. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీలో పెరిగారు. ఆ సమయంలో ఆ ప్రాంతం ఈజిప్టు ఆధీనంలో ఉండేది. ఖాన్ యూనిస్ కిరాతకుడిగా సిన్వార్‌కు గుర్తింపు ఉంది. సిన్వార్ కుటుంబం తొలుత ఆషకెలాన్ అనే ప్రాంతంలో సెటిల్ అయ్యారు. 1948లో వాళ్లు గాజాకు వలసవెళ్లారు. గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్‌లో ఆయనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది.
జైలులో సిన్వార్ సుమారు 24 ఏళ్లు గడిపాడు. 1982లో అతన్ని అరెస్టు చేశారు. సాహ్ షెహదేతో జతకట్టిన ఆయన.. ఇజ్రాయిల్ గూఢాచారుల్ని టార్గెట్ చేశాడు. 2002లో ఇజ్రాయిల్ దళాలు షెహదేను కాల్చి చంపాయి. హమాస్ మిలిటరీ వింగ్ అధినేతగా ఉన్న సమయంలో అతన్ని చంపేశారు. 1987లో హమాస్‌ను స్థాపించిన తర్వాత .. సిన్వార్ ప్రారంభంచిన శాఖ బలంగా ఎదిగింది. ఇద్దరు ఇజ్రాయిల్ సైనికుల్ని, నలుగురు పాలస్తీనియన్లను చంపిన కేసులో 1988లో సిన్వార్‌ను అరెస్టు చేశారు.
హమాస్ మిలిటరీ వింగ్ ఒకటి 2006లో ఆర్మీ పోస్టుపై దాడి చేసిన ఇద్దరు ఇజ్రాయిల్ సైనికుల్ని చంపింది. ఆ తర్వాత గిలాడ్ షాలిట్ అనే ఓ సైనికుడిని ఆధీనంలోకి తీసుకున్నది. అయితే 2011లో ఖైదీల అప్పగింతలో భాగంగా జరిగిన ఒప్పందం ప్రకారం సిన్వార్‌ను రిలీజ్ చేశారు. స్నాప్ డీల్ తర్వాత రిలీజైన సిన్వార్.. హమాస్ మిలిటరీ ర్యాంక్‌లో దూసుకెళ్లారు. 2015లో అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో అమెరికా చేర్చింది. హమాస్‌కు చెందిన మిలిటరీ వింగ్ ఇజ్జదినే అల్ ఖాసమ్ బ్రిగేడ్స్ ఏర్పాటులో సిన్వార్ కీలక పాత్ర పోషించారు. గాజాలో హమాస్ చీఫ్‌గా నియమితుడయ్యాడు.
హమాస్ నాయకుల్లో రెండవ స్థానంలో ఉన్న సిన్వార్.. గాజాలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఇస్మాయిల్ హనియే ఆ సంస్థలో అగ్ర స్థానంలో ఉన్నారు. అయితే ఆయన అదృశ్యంగా ఉన్ననేపథ్యంలో.. గాజాలో డిఫాక్టో రూలర్‌గా సిన్వార్ కొనసాగుతున్నాడు. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేపట్టాలని సిన్వార్ ప్రసంగాలతో రెచ్చగొడుతుంటాడు.
గత శనివారం ఇజ్రాయిల్‌పై జరిగిన దాడులకు మాస్టర్‌మైండ్ సిన్వార్ అని ఇజ్రాయిల్ రక్షణ దళాలు ఆరోపిస్తున్నాయి. సెప్టెంబర్ లెవన్ దాడులకు ఒసామా బిన్ లాడెన్ ఎలాగో.. ఇజ్రాయిల్‌పై దాడులకు సిన్వారే మాస్టర్‌మైండ్ అని ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ తెలిపారు. ఇజ్రాయిలీలతో చేతులు కలిపిన పాలస్తీనియన్లను హత మారుస్తూ.. కిరాతుకుడిగా సిన్వార్ అవతరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిన్వార్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Gaza strip
- Hamas
- IDF
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

