వుహాన్ ల్యాబ్ లీక్.. చైనా సైన్యానికి లింక్

న్యూయార్క్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీకైనట్లు తాజాగా కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్లీ వైరస్ జాడ ఆసక్తికరంగా మారింది. బ్రిటన్‌కు చెందిన డెయిల్ మెయిల్ రాసిన కథనంతో అమెరికా మళ్లీ అప్రమత్తమైంది. అయితే ఈ ఘటనపై ఆ దేశ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పాంపియో స్పందించారు. వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో పరిశోధనలతో పాటు ఆ దేశ సైన్యం కూడా ల్యాబ్ పరీక్షల్లో నిమగ్నమైనట్లు పాంపియో ఆరోపించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు ఆ ల్యాబ్ పరీక్షలో భాగస్వామ్యులయ్యారని, వైరస్ పరిశోధనలతో పాటు సైనిక కార్యకలాపాలు కూడా నిగూఢంగా సాగినట్లు ఆయన ఆరోపించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పీఎల్ఏ సైన్యంతో వాళ్లు ఆ ల్యాబ్‌లో ఏం చేశారో చెప్పడానికి ఇష్టంగా లేరని, అసలు ఎలాంటి పరిశోధనలు జరిగాయో కూడా చెప్పడం లేదని, ఆ ల్యాబ్‌కు వెళ్లేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అవకాశం ఇవ్వడం లేదని పాంపియో పేర్కొన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి ఎలా పుట్టింది.. ఎక్కడ పుట్టింది అన్న దానిపై శాస్త్రవేత్తలు తమ అనుమానాలను వ్యక్తం చేయడంతో.. ఆ వైరస్ ఆనవాళ్లను కనుక్కోవాలని వాదన మళ్లీ ఊపందుకున్నది. దీంతో చైనాపై తీవ్ర వత్తిడి పెరుగుతున్నది. వైరస్ విషయంలో శాస్త్రవేత్తలను చైనా కనికట్టు చేసినట్లు ప్రొఫెసర్ నికోలై పెట్రోస్కీ స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. చైనీస్ ల్యాబ్ నుంచి వైరస్ లీకైనట్లు చాలా మంది నిపుణులు భావిస్తున్నారని, దీంతో చైనా వత్తడికి లోనవుతున్నట్లు ఆయన ఓ షోలో తెలిపారు. పంగోలిన్స్ నుంచి మనుషులకు వైరస్ పాకినట్లు చైనా చెప్పుకొచ్చినా.. దీంట్లో వాస్తవం లేదన్న అభిప్రాయాన్ని ప్రొఫెసర్ పెట్రోస్కీ వ్యక్తం చేశారు. వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేసిన డబ్ల్యూహెచ్‌వో.. ఆ వైరస్ ల్యాబ్ నుంచి లీకైనట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

