కరోనా పుట్టింది వుహాన్ ల్యాబ్‌లోనే.. పార్లమెంట్ కమిటీకి చెప్పిన కెనడా శాస్త్రవేత్త

లండన్: చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ వ్యాప్తి చెందినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆరోపణలను ఓ జన్యు శాస్త్రవేత్త నిజమే అని పేర్కొన్నది. కెనడాకు చెందిన జీవకణ శాస్త్రవేత్త డాక్టర్ అలీనా చాన్ ఈ విషయాన్ని ద్రువీకరించారు. ఆ దేశ పెద్దల సభకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ ముందు ఆమె ఈ విషయాన్ని తెలిపారు.
కోవిడ్ మహమ్మారి వుహాన్ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ నుంచే పుట్టినట్లు అలీనా చాన్ పార్లమెంట్ కమిటీకి వెల్లడించింది. వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్తో లింకు ఉన్న పూరిన్ క్లీవేజ్ సైట్ నుంచి కరోనా వైరస్ ప్రబలినట్లు ఆమె తన రిపోర్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఉన్న దశలో.. కరోనా వైరస్ సహజంగా పుట్టిందని చెప్పడం కన్నా… ఆ ప్రాణాంతక వైరస్ ల్యాబ్ నుంచే లీకైనట్లు ఆమె పార్లమెంట్ కమిటీకి స్పష్టం చేశారు.
హునాన్ సీఫుడ్ మార్కెట్ నుంచి మనుషుల ద్వారా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని చాలా వరకు భావిస్తున్నారని, అయితే ఆ మార్కెట్ నుంచి సహజసిద్ధంగా వైరస్ వ్యాప్తి అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఆమె అన్నారు. ల్యాబ్ నుంచి లీక్ కావడానికి ముందు వైరస్‌లో జన్యు మార్పులు చేశారా అని కమిటీ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. మేటి వైరాజలిస్టులు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

