రష్యా సైనిక వాహనాలపై ‘జెడ్’ (Z) గుర్తు ఎందుకు ఉందో తెలుసా?
ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య రెండో రోజూ కొనసాగుతోంది. పలు నగరాలు, మిలటరీ బేస్‌లపై రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వేలాది మంది పౌరులు అండర్ గ్రౌండ్లో దాక్కుండిపోయారు. తాజాగా… ఉక్రెయిన్‌లోని రెసిడెన్షియల్ హైరైజ్ అపార్ట్‌మెంట్‌పై రష్యా మిసైల్ దూసుకొచ్చిందని పేర్కొంటున్నారు. అయితే.. రష్యాకు చెందిన పలు సైనిక వాహనాలపై z గుర్తు ఉండటం అందర్నీ ఆకర్షిస్తోంది.
ఓ వాహనంపై ఈ z గుర్తు ఓ స్థలంలో ఓ ఆకారంలో, మరో వాహనంపై ఇదే గుర్తు మరో ఆకారం, మరో స్థలంలో కనిపిస్తోంది. కానీ… z గుర్తు అన్ని వాహనాలకూ కనిపిస్తోంది. ఇదో రకమైన ఎర్రజెండా లాంటిదట. వీటిని రోజ్గావార్డియా ట్రూప్స్ అని పిలుస్తుంటారు. రష్యా జాతీయ భద్రతా దళం అని కూడా అంటుంటారు. వీరందరూ ఖైదీలను తీసుకెళ్లే ఎవ్‌టోజాక్స్ వాహనాల్లో వీరందరూ వెళ్తున్నారు. బెల్గోరోడ్ ప్రాంతంలోని ఈ వాహనాలను ఎప్పుడూ ఈ జెడ్ గుర్తును కలిగే వుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే రష్యా జాతీయ భద్రతా దళాలు వాడే వాహనాలపైనే ఈ జెడ్ (z) గుర్తు వుంటుందని, దీనిని బట్టి, రష్యా వీరిని కూడా రంగంలోకి దింపిందని అర్థం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ (రష్యా జాతీయ భద్రతా దళం) రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతా వ్యవహారాలను మాత్రమే చూస్తుంది. వీందరూ మెరికల్లాంటి జవాన్లని, ఆర్మ్డ్ ఫోర్స్ కంటే మెరికల్లా విధులు నిర్వర్తిస్తారని తెలుస్తోంది. ఏ ప్రదేశంలోనైనా చొరబడి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే శక్తి ఈ బలగాలకు ఉంటుందని, వీరికి అంత సుశిక్షితంగా ట్రైనింగ్ ఇస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే ఇంకో వాదన కూడా ఉంది. రష్యా సైనికులే రష్యా సైనికుల వాహనాలపై కాల్పులు జరపకుండా ఈ జెడ్ (z) గుర్తును వాడుతున్నారని పేర్కొంటున్నారు. ఇదో రకమైన కమ్యూనికేషన్ సిగ్నల్స్ అని పేర్కొంటున్నారు. ఇక… కేవలం యుద్ధాల్లోనే వీటిని ఉపయోగిస్తారు అన్న మెసేజ్ కూడా ఇందులో ఉంటుందట. అధికారులకు కూడా సులభంగానే యుద్ధానికి ఉపయోగించే వాహనమేదో తెలిసిపోడానికి జెడ్ (z) అక్షరం రాస్తారట.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

