Reaper Drone: MQ-9 రీపర్ డ్రోన్ ప్రత్యేకతలు ఏంటి.. రష్యా ఎందుకు దాన్ని కూల్చింది?
Reaper Drone: అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్‌ను రష్యా కూల్చివేసింది. నల్ల సముద్రం వద్ద ఈ ఘటన జరిగింది. తమ మిలిటరీకి చెందిన ఇంటెలిజెన్స్ సమాచారన్ని ఉక్రెయిన్‌కు అమెరికా చేరవేస్తున్నట్లు రష్యా ఆరోపిస్తోంది.
హైదరాబాద్: నల్ల సముద్రం(Black Sea)పై అమెరికా డ్రోన్‌ను రష్యా కూల్చివేసిన ఘటన తెలిసిందే. అమెరికాకు చెందిన ఆ డ్రోన్‌ను MQ-9 రీపర్ డ్రోన్(Reaper Drone)గా పిలుస్తున్నారు. ఒరిజినల్ MQ-1 ప్రిడేటర్ నుంచి దీన్ని డెవలప్ చేశారు. అమెరికా మిలిటరీ దీన్ని ఐఎస్ఆర్(ISR) ప్లాట్‌ఫామ్ కింద తయారు చేసింది. ఇంటెలిజెన్స్, సర్వియలెన్స్, రికన్నైసెన్స్ కోసం దీన్ని వినియోగించనున్నారు. ఐఎస్ఆర్ వర్క్ కోసం ఈ డ్రోన్‌ను వాడినా.. దాని ప్రైమరీ ఉద్దేశం వాటాడి చంపడమే.
రీపర్ డ్రోన్ సుమారు 1700 కేజీల బరువు ఉండే లైజర్ గైడెడ్ బాంబులు(laser guided bombs) లేదా హెల్ఫైర్ మిస్సైళ్లను మోసుకెళ్లగలదు. కాలిఫోర్నియాకు చెందిన జనరల్ డైనమిక్స్(general dynamics) దీన్ని డెవలప్ చేసింది. రిమోట్ కంట్రోల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తారు. ఈ డ్రోన్ రెక్కలు సుమారు 20 మీటర్లు ఉంటాయి. 950 హార్స్పవర్ టర్బో ఇంజిన్ దీంట్లో ఉంటుంది. దాదాపు 280 నుంచి 310 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకువెళ్తుంది. అమెరికా మిలిటరీ వద్ద సుమారు 300 రీపర్ డ్రోన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
బ్లాక్ సీ వద్ద జరిగిన ప్రమాదంపై అమెరికా తాజాగా ప్రకటన చేసింది. తమ డ్రోన్ అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్(airspace) నిబంధనల మేరకే ఎగురుతున్నట్లు చెప్పింది. కానీ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసిన నిషేధిత ప్రాంతంలో ఆ డ్రోన్ ఎగిరినట్లు రష్యా ఆరోపిస్తోంది. క్రిమియా(crimea)లోని సేవాస్టోపోల్ పోర్టుకు 60 కిలోమీటర్ల దూరంలో డ్రోన్‌ను కూల్చివేసినట్లు రష్యా మీడియా పేర్కొన్నది.
అమెరికా, నాటో (nato)దళాలు తమ ఎయిర్‌స్పేస్‌లో నిఘా ఆపరేషన్లు చేపడుతున్నట్లు రష్యా ఆరోపిస్తోంది. డ్రోన్‌కు చెందిన కొన్ని శిథిలాలను రష్యా సేకరించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

