‘మిథ్యా’ ప్రపంచం

- వీఆర్, ఏఆర్ సాంకేతికతతో ‘మెటావర్స్’ రూపకల్పన
- సుదూరంలోని వ్యక్తులు మనపక్కనే ఉన్నట్టు భావన
- కంప్యూటర్ ప్రోగ్రామ్‌తో స్పర్శ అనుభూతి కూడా..
- ‘మెటావర్స్’ రేసులో ఫేస్బుక్, వ్యాన్స్, మైక్రోసాఫ్ట్, ఎపిక్ గేమ్స్, ఎన్విడియా
హాలీవుడ్ చిత్రం ‘మ్యాట్రిక్స్’ చూశారా? వర్చువల్-అగ్మెంటెడ్ రియాలిటీలో హీరో చేసే మానవాతీత విన్యాసాలు అబ్బురపరుస్తాయి. అచ్చం అలాంటి సాంకేతికతనే నిజజీవితంలోకి తీసుకురావడానికి దిగ్గజ కంపెనీలు ముందుకు కదిలాయి. ఈ బృహత్తర కార్యం సఫలీకృతమైతే ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రపంచం.. ఓ బ్రహ్మాండమైన ‘మెటావర్స్’గా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఆ విశేషాలపై ప్రత్యేక కథనం..
ఏమిటీ ‘మెటావర్స్’
‘మెటావర్స్’ అంటే వర్చువల్ రియాలిటీ (వీఆర్), అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) కలగలిపిన స్పేస్. కంప్యూటర్ సృష్టించిన ఓ మిథ్యా లోకంగా దీన్ని పిలువొచ్చు. ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఉన్న వారిని దగ్గరగా చేర్చి.. ఒకే రూవ్‌ులో ఎదురెదుగా ఉన్నామనే భావనను ఇది కలిగిస్తుంది. వ్యక్తులను ప్రత్యక్షంగా కలిసినప్పుడు కలిగే శారీరక, ఆంతరంగిక ప్రతిస్పందనలను కంప్యూటర్ ప్రోగ్రామ్ సాయంతో అనుభూతి పొందొచ్చు. ‘మెటావర్స్’ కాన్సెప్ట్‌ను తొలిసారిగా ‘స్నోక్రాష్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ‘మెటా’ అంటే బ్రహ్మాండమైనదని, ‘వర్స్’ అంటే విశ్వమని అర్థం. ‘మెటావర్స్’ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొనే ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీస్ ‘అవతార్’, ‘స్టార్‌వార్స్’ను రూపొందించడం విశేషం.
ఎలా వాడొచ్చు?
‘మెటావర్స్’ భావన ఇటీవల వార్తల్లో నిలువడానికి ఫేస్బుక్ సంస్థ ఒక కారణమని చెప్పొచ్చు. ఆ సంస్థ సీఈవో జూకర్ బర్గ్ గత జూలైలో మాట్లాడుతూ.. తాము అభివృద్ధి చేస్తున్న ‘హారిజోన్ వర్క్ రూవ్‌ు’ యాప్.. ‘మెటావర్స్’ సాంకేతికతకు తొలి అడుగ్గా పేర్కొన్నారు. ఫేస్బుక్ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశాలకు ఏకకాలంలో హాజరవ్వడం దేశ, విదేశాల్లోని ఆ సంస్థ ప్రతినిధులకు కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్‌కి హాజరైనప్పటికీ, ప్రత్యక్షంగా హాజరైన అనుభూతి, విషయాల ఆకళింపు సాధ్యపడట్లేదు. దీంతో ఫేస్బుక్ ఈ ‘హారిజన్ వర్క్ రూవ్‌ు’ను సిద్ధం చేసింది. ఓకులస్ క్వెస్ట్ 2 హెడ్సెట్ సాయంతో జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 50 మంది వరకు పాల్గొనవచ్చని ఆ సంస్థ వెల్లడించింది.
నిజంగా సాధ్యమా?
ఫేస్బుక్ అభివృద్ధి చేసిన ‘హారిజోన్ వర్క్ రూవ్‌ు’ పూర్తిగా ‘మెటావర్స్’ సాంకేతికత అని చెప్పలేం. నిజానికి ‘మెటావర్స్’లో పాల్గొనే వ్యక్తులు.. ఎక్కడో ఉన్న వ్యక్తులను మిథ్యా వేదికలో తాకినప్పుడు శారీరకంగా కూడా ఆ అనుభూతిని పొందాలి. కానీ, ‘హారిజోన్ వర్క్ రూవ్‌ు’లో కేవలం దృశ్యపరంగా మాత్రమే ప్రతిస్పందించే అవకాశమున్నది. అయితే, ఇప్పుడున్న సాంకేతికత, మౌలిక వసతులతో ‘మెటావర్స్’ను పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయినప్పటికీ, భవిష్యత్తులో సాధ్యమేనని సాంకేతికత నిపుణులు అంచనా వేస్తున్నారు. సాంకేతికత, వీఆర్, ఏఆర్, బ్యాకెండ్, ఎక్స్‌పీరియెన్షియల్ ఫ్రంట్ఎండ్స్ ఏకకాల సమన్వయంతోనే ‘మెటావర్స్’ పనిచేస్తుందని చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Motaverse
- virtual reality
- VR
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

