సర్జరీ సమయంలో ఏడ్చినందుకు.. ఆసుపత్రి బిల్లులో చార్జ్

వాషింగ్టన్: సర్జరీ సమయంలో ఏడ్చినందుకు ఒక మహిళకు ఆసుపత్రి బిల్లులో భావోద్వేగం పేరుతో స్వల్పంగా చార్జ్ చేశారు. ఆ మహిళ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. సాధారణంగా ఆసుపత్రి అన్నా, అందులోనూ శస్త్రచికిత్స అన్నా రోగులు భయాందోళన చెందుతారు. అమెరికాకు చెందిన మిడ్జ్ అనే ట్విట్టర్ యూజర్ ఇటీవల తన శరీరంపై ఉన్న మచ్చను తొలగించుకునేందుకు సర్జరీ చేయించుకున్నారు. కాగా, శస్త్రచికిత్స సమయంలో ఆమె కొంచెం ఏడ్చారు.
అయితే ఆసుపత్రి బిల్లులో దీనికి కూడా చార్జ్ చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. సర్జరీ సమయంలో స్వల్ప భావోద్వేగం పేరుతో 11 డాలర్లు (సుమారు రూ.817) బిల్లులో వేశారు. దీంతో మోల్ తొలగించినందుకు 223 డాలర్లు, ఏడ్చినందుకు అదనపు చార్జీ అంటూ సంబంధిత సర్జరీ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు.
కాగా, సెప్టెంబర్ 29న పోస్ట్ చేసిన ఈ ఆసుపత్రి బిల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు విభిన్నంగా దీనిపై స్పందించారు. అమెరికా ఆరోగ్య రంగంపై కొందరు విమర్శలు చేశారు. తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను మరి కొందరు పంచుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

