పాక్, చైనా అణు పరీక్షలు… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
పాకిస్థాన్, చైనా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. రష్యా, ఉత్తర కొరియా కూడా తమ అణ్వస్ర్తాలను పరీక్షించుకుంటున్నాయని తెలిపారు. అణు బాంబులు కలిగి ఉన్న దేశాలు వాటి పరీక్షలను నిర్వహిస్తున్నాయని, ఆ విషయాన్ని మాత్రం అవి వెల్లడించబోవని ట్రంప్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 3 : పాకిస్థాన్, చైనా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. రష్యా, ఉత్తర కొరియా కూడా తమ అణ్వస్ర్తాలను పరీక్షించుకుంటున్నాయని తెలిపారు. అణు బాంబులు కలిగి ఉన్న దేశాలు వాటి పరీక్షలను నిర్వహిస్తున్నాయని, ఆ విషయాన్ని మాత్రం అవి వెల్లడించబోవని ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా, పాకిస్థాన్ ఇప్పటికే రహస్యంగా తమ అణు పరీక్షలు నిర్వహించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. రష్యా నిర్వహిస్తోంది.. చైనా నిర్వహిస్తోంది. కాని అవి మాత్రం దాని గురించి మాట్లాడవు. మాది మాత్రం స్వేచ్ఛా సమాజం.
మేము చాలా భిన్నం. అందుకే దాని గురించి మాట్లాడతాము. అంతేగాక అక్కడ జరుగుతున్న పరీక్షల గురించి ఆ దేశంలోని విలేకరులు కూడా ఏమీ రాయరు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా, పాకిస్థాన్ కూడా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్ ఈ ఏడాది మేలో అణు యుద్ధం అంచుల వరకు వెళ్లాయని, వాణిజ్యం, సుంకాలు బూచిగా చూపించి ఆ యుద్ధాన్ని నివారించానని అదే ఇంటర్వ్యూలో ట్రంప్ పునరుద్ఘాటించారు.
మా అణుబాంబులతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగలం
ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగల అణు బాంబులు తమ వద్ద తగినన్ని ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు. అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించాలని అమెరికన్ మిలిటరీకి తాను ఇచ్చిన ఆదేశాలను ఆయన సీబీఎస్‌కి చెందిన 60 మినిట్స్ ఇంటర్వ్యూలో సమర్థించుకున్నారు. అణు పరీక్షలకు దూరంగా అమెరికా ఒక్కటే ఉండడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక అణ్వస్ర్తాలు అమెరికా వద్ద ఉన్నప్పటికీ తన సైనిక ప్రత్యర్థులైన రష్యా, చైనా వేగంగా తమ అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాయని ట్రంప్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

