Cleveland | కాల్పులు ఆపమన్నందుకు ఐదుగురిని కాల్చి చంపాడు..
Cleveland | టెక్సాస్ : టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో దారుణం జరిగింది. కాల్పులు ఆపమన్నందుకు ఓ ఐదుగురు వ్యక్తులను కాల్చిచంపాడు దుండగుడు. ఐదుగురిని పొట్టన పెట్టుకున్న ఆ నిందితుడి కోసం 200 మంది పోలీసులు గాలిస్తున్నారు.
Cleveland | టెక్సాస్ : టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో దారుణం జరిగింది. కాల్పులు ఆపమన్నందుకు ఓ ఐదుగురు వ్యక్తులను కాల్చిచంపాడు దుండగుడు. ఐదుగురిని పొట్టన పెట్టుకున్న ఆ నిందితుడి కోసం 200 మంది పోలీసులు గాలిస్తున్నారు.
క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ఫ్రాన్సిస్‌స్కో ఓరోపెసా(38) అనే వ్యక్తి ఏఆర్-15 స్టైల్ రైఫిల్‌తో శుక్రవారం రాత్రి సమయంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఆ కాల్పుల శబ్దానికి పొరుగింట్లో ఉన్న ఓ 8 ఏండ్ల బాబు నిద్ర లేచాడు. దీంతో తమ నిద్రకు ఆటంకం కలుగుతుందని, కాల్పులు ఆపాలని ఆ వ్యక్తిని బాధిత కుటుంబం కోరింది. ఓరోపెసా వారి మాటలు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా వారిపై కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ కాల్పులు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. క్లీవ్‌ల్యాండ్‌లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. నిందితుడి సమాచారం అందిస్తే 80 వేల డాలర్లను పారితోషికంగా ఇస్తామని ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

