US plane | అమెరికా విమానం మిస్సింగ్.. ఖతార్ పరిధిలో కనిపించకుండా పోయిన ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్
US plane : బోయింగ్ కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ అనే ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్‌గా పిలిచే విమానం ఇరాన్ సమీపంలోని పర్షియన్ గల్ఫ్ తీరంలో ప్రయాణిస్తుండగా గల్లంతైంది.
US plane : గాలిలోనే ఇంధనం నింపగల సామర్ధ్యం ఉన్న అమెరికాకు చెందిన విమానం ఒకటి కనిపించకుండా పోయింది. బోయింగ్ కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ అనే ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్‌గా పిలిచే విమానం ఇరాన్ సమీపంలోని పర్షియన్ గల్ఫ్ తీరంలో ప్రయాణిస్తుండగా గల్లంతైంది. గల్లంతు కావడానికి కొద్దిసేపటి ముందు ఎమర్జెన్సీ సిగ్నల్ అందించింది. ఒకపక్క మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ సంక్షోభం నెలకొన్నదృష్ట్యా ఈ విమానం కనిపించకుండా పోవడం ఆసక్తికరంగా మారింది.
ఈ అమెరికా విమానం యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరింది. ఖతార్ వద్ద ప్రయాణిస్తున్నప్పుడు సిగ్నల్ కోల్పోయింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గల్ఫ్, ఇరాన్ ప్రాంతంలో మోహరించిన అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు ఈ విమానం సాయపడుతోంది. విమానం కనిపించకుండా పోవడానికి లేదా ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడానికి ముందు గాలిలో కొద్దిసేపు గుండ్రంగా తిరిగినట్లు డాటా ద్వారా వెల్లడవుతోంది. ఈ విమానం కనిపించకుండా పోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అలాగే, ఈ ఘటనలో తమ ప్రమేయం గురించి ఇరాన్ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అమెరికా మిలిటరీ కూడా దీనిపై స్పందించలేదు. గత మార్చిలో ఇరాన్ జరిపిన దాడుల్లో ఇలాంటి మరో కేసీ–135 విమానాన్ని అమెరికా ఇరాక్ భూభాగంలో కోల్పోయింది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఈ దాడి చేశామని ఇరాక్ ప్రకటించింది. ఈ విమానం అమెరికన్ ఆర్మీకి చాలా కీలకమైంది. గాలిలోనే యుద్ధ విమానాల్లో ఇంధనం నింపగలదు. అలాగే, సామగ్రిని, ప్రయాణికుల్ని కూడా మోసుకెళ్లగలదు. ఈ తరహా విమానాలు అమెరికా రక్షణ రంగంలో 60 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

