రూ.15 లక్షల వేతనంతో.. కుక్కకు కొలువు

వాషింగ్టన్: అమెరికాకు చెందిన బుష్ బీర్ కంపెనీ కుక్కకు సుమారు రూ.15 లక్షల వేతనంతో కూడిన ఉన్నత కొలువును ఆఫర్ చేసింది. కుక్కల కోసం ఆ కంపెనీ ఉత్పత్తి చేసే బీర్‌ను టేస్ట్ చేయడంతోపాటు ఇతర టాస్క్‌ల నిమిత్తం చీఫ్ టెస్టింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి ఈ నెల 13న ప్రకటన ఇచ్చింది. మీ కుక్కను ఛీఫ్ డాగ్ టెస్టింగ్ ఆఫీసర్‌గా నియమించుకుంటాం. 20 వేల డాలర్లు వేతనంగా చెల్లిస్తాం. బీమాతోపాటు బుష్ డాగ్ బ్రూ బీర్‌ను ఉచితంగా అందిస్తాం అని తెలిపింది. బీర్‌ను టేస్ట్ చేయడం, క్వాలిటీ కంట్రోల్, ఉత్పత్తికి అంబాసిడర్‌గా వ్యవహరించడం, సామాజిక మాధ్యమాల్లో ఉత్పత్తి ప్రచారం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఆసక్తి ఉన్నవారు తమ అందమైన పెంపుడు కుక్క ఫోటోతోపాటు అది ఎందుకు ఈ ఉద్యోగానికి తగినదో వివరిస్తూ కాంటెస్ట్ స్పెషల్ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలనిబుష్ బీర్ కంపెనీ వివరించింది. ఈ నెల 28తో పోటీ ముగుస్తుందని, క్రియేటివిటీ, ప్రత్యేకతలను బట్టి కుక్క ఎంపిక ఫలితాన్ని ఈ నెలాఖరులో ప్రకటిస్తామని వెల్లడించింది.

మరోవైపు తమ పెంపుడు కుక్కలకు ఈ బంపర్ ఆఫర్ ఉద్యోగం కోసం వాటి యజమానులు పోటీ పడుతున్నారు. తమ శునకాల ఫొటోతోపాటు వాటి ప్రత్యేకతలను వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ బంపర్ కొలువు ఏ కుక్కకు వరిస్తుందో అన్నది ఈ నెలాఖరుకు తెలుస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

