CEO Andy Byron: హెచ్ఆర్ మేనేజర్‌తో రొమాన్స్.. సీఈవోను సస్పెండ్ చేసిన కంపెనీ
CEO Andy Byron: అమెరికాకు చెందిన ఆస్ట్రోనామర్ కంపెనీ సీఈవో ఆండీ బైరన్పై వేటు పడింది. కోల్డ్‌ప్లే కన్సర్ట్ ప్రోగ్రామ్‌లో ఆ కంపెనీకి చెందిన హెచ్ఆర్ మేనేజర్‌తో అతను రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో కంపెనీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది.
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఆస్ట్రోనామర్ కంపెనీ సీఈవో ఆండీ బైరన్(CEO Andy Byron)పై వేటు పడింది. ఆ కంపెనీ అతన్ని సస్పెండ్ చేసింది. తాజాగా జరిగిన కోల్డ్‌ప్లే కన్సర్ట్ ప్రోగ్రామ్‌లో సీఈవో ఆండీ బైరన్.. ఆ కంపెనీకి చెందిన హెచ్ఆర్ మేనేజర్‌తో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో ఆ కంపెనీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. బోస్టన్‌లో జరుగుతున్న మ్యూజిక్ షో సమయంలో… ఆస్రోనామర్ కంపెనీకి చెందిన సీనియర్ ఉద్యోగులు ఫుల్ రొమాన్స్ మూడ్‌లో ఉన్నారు.
కంపెనీలో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న క్రిస్టిన్ కాబట్ను గట్టిగా హత్తుకుని సీఈవో ఆండీ బైరన్ డ్యాన్స్ చేశాడు. ఆ ఇద్దరూ తన్మయత్వంతో ఊగిపోయారు. అయితే కన్సర్ట్ షోకు చెందిన లైట్లు వాళ్లపై ఫోకస్ చేయగానే ఆ జంట సడెన్‌గా విడిపోయారు. ఒకరి నుంచి ఒకరు దూరం వెళ్లే ప్రయత్నం చేశారు. సీఈవో బైరన్ కిందకు వంగాడు. దీంతో ఆ మ్యూజిక్ షోలో పాట పాడుతున్న గాయకుడు ఆ ఇద్దరి మధ్య అఫైర్ ఉన్నట్లు తెలుస్తోందన్నాడు.
ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో గత రెండు రోజుల నుంచి ఇంటర్నెట్లో టాపిక్ ట్రెండ్ అవుతున్నది. ఘటన గురించి తెలుసుకున్న కంపెనీ.. ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నది. సీఈవో ఆండీ బైరన్‌ను సస్పెండ్ చేస్తూ లీవ్ మీద పంపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

